అందుకే నాకు హాలీవుడ్ ఆఫర్లు రావట్లేదేమో

Updated By ManamFri, 09/07/2018 - 15:39
SHAH RUKH KHAN

SHAH RUKH KHANబాలీవుడ్‌ కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్‌కు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే ఆయన ఇంతవరకు ఏ హాలీవుడ్ చిత్రంలోనూ నటించలేదు. ఈ విషయంపై తాజాగా ఇటీవల ఓ మీడియా ప్రతినిధి షారూక్‌ను ప్రశ్నించాడు. అయితే దీనిపై షారూక్ సమాధానం చెబుతూ అక్కడున్న అందరినీ నవ్వించాడు.

నేను రోజు చంద్రుడిని చూస్తా. అలాగని దాని దగ్గరకు వెళ్లలేను కదా. ఓంపురి నుంచి ప్రియాంక వరకు అందరూ హాలీవుడ్‌లో రాణిస్తున్నారు. వాళ్ల స్థాయికి నేను ఎందుకు చేరుకోలేకపోతున్నానో అర్థం కావడం లేదు. బహుషా నేను ఇంగ్లీష్‌లో వీక్ అవ్వడం వలన అవకాశాలు రాలేదేమో అంటూ అన్నాడు. ఈ వ్యాఖ్యలకు అక్కడున్న అందరూ నవ్వారు.

English Title
Shah Rukh Khan about his hollywood offer
Related News