షాహిద్ కపూర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..

Updated By ManamThu, 09/06/2018 - 18:01
Shahid Kapoor, Twitter account hack, hate message, Padmaavat
  • ‘పద్మావత్’ చిత్రంపై అసభ్యకర సందేశాన్ని జతచేసి పోస్టింగ్ 

  • షాహిద్ కపూర్ ట్విట్టర్‌లో టర్కీష్ భాషలో రీట్వీట్స్.. 

Shahid Kapoor, Twitter account hack, hate message, Padmaavatముంబై: బాలీవుడ్ నటుడు షాహిద్ కపూ‌ర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. షాహిద్ భార్య మీరా రాజ్‌పూట్ గత రాత్రి రెండోబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా షాహిద్ ఇంట్లో వేడుకుల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో షాహిద్ తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌‌కు గురైనట్టు గుర్తించారు. ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసిన హ్యాకర్.. ప్రత్యేకించి టర్కీష్ భాషలో వివాదాస్పద చిత్రం ‘పద్మావత్’ చిత్రంపై అసభ్యకరమైన సందేశాన్ని పోస్టు చేశాడు. ఈ ఏడాదిలో బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన పద్మావత్ చిత్రం ఎన్నో వివాదాలను దాటుకొని విజయవంతంగా విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో షాహిద్.. చిత్తూర్ మహార్వాల్ రతన్ సింగ్‌ పాత్రను పోషించగా.. రన్‌వీర్ సింగ్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రలో.. దీపకా పదుకొనె పద్మావతిగా నటించారు. ఈ చిత్రానికి ఎన్నో అవంతరాలు చుట్టుముట్టిన సంగతి విదితమే. ఈ వివాదాస్ప చిత్రంపై టర్కీష్ భాషలో హ్యాకర్ షాహిద్ ట్విట్టర్ అకౌంట్‌లో అసభ్యకర సందేశాన్ని పోస్టు చేసి.. ఆ పోస్టును ఇతర విదేశీ అకౌంట్లకు పలుసార్లు రీట్వీట్ చేశాడు. ‘ఐ లవ్ కత్రినా’ అనే క్యాప్షన్‌తో ‘ఎక్తా థా టైగర్’ చిత్రం నుంచి ‘మషాల్హ్’ అనే పాటను కూడా షేర్ చేశాడు. కాగా, షాహిద్ కపూర్ నటించిన కొత్త చిత్రం ‘భట్టి గుల్ మీటర్ ఛాలు’ ఈ నెల 21న విడుదల కానుంది. Shahid Kapoor, Twitter account hack, hate message, Padmaavat

English Title
Shahid Kapoor's Twitter account hacked with hate message on Padmaavat
Related News