భారీగా పతనమైన ఎస్ బ్యాంకు షేర్లు

Updated By ManamFri, 09/21/2018 - 22:12
yes bank

yes bankన్యూఢిల్లీ: ప్రైవేటు రంగ ఎస్ బ్యాంక్‌కు మార్కెట్‌లో 34 శాతం నష్టాన్ని చవిచూసింది.  బ్యాంకు సీఈఓగా రాణా కపూర్‌ను పొడగించడం కుదర దని ఆర్బిఐ చెప్పడంతో దాని ప్రభావం మార్కెట్‌లో ఎస్ బ్యాంకు షేర్లపై పడింది. దీంతో బ్యాంకు బీఎస్‌ఈలో దాదాపు 34 శాతం(రూ. 210.10) నష్టాన్ని మూటగట్టుకుని 52 వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అటు ఎన్‌ఎస్‌ఈలోనూ 31 శాతం(రూ. 218.10) నష్టం తో ఏడాది కనిష్ఠ స్థాయిని  నమో దు చేసింది. ఇంత మొత్తంలో బ్యాంకు షేర్లు నష్టాన్ని చవి చూడ టం దశాబ్ద కాలంలో ఇదే ప్రథ మం. ఇక బీఎస్‌ఈలో మార్కెట్ వాల్యువేషన్ రూ. 14,451.82 కోట్ల తగ్గుదలతో రూ. 59,261.15 కోట్లకు చేరింది. బ్యాంకు 2004లో ప్రారంభించినప్పటి నుంచి మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా రాణా కపూర్ కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన వాటాదార్ల సమావేశంలో ఆయన పదవీ కాలం మరో మూడేళ్లు (2021) వరకు పొడగించేందుకు నిర్ణయించారు. అయితే తుది ఆమోదం కోసం ఆర్బిఐకి పంపిన అభ్యర్థనను తిరస్కరించింది. ఆయనకు 2019 జనవరి 31 వరకు మాత్రమే ఆ పదవిలో కొనసాగేందుకు  రిజర్వు బ్యాంకు అనుమతినిచ్చింది. ఆ తర్వాత కచ్చితం గా కొత్త సీఈఓను నియమించుకోవాలని ఆర్బీఐ ఎస్ బ్యాంకుకు సూచించింది. ఈ విషయమై ఈ నెల 25న బ్యాంకు డైరెక్టర్ల బోర్డు సమావేశమై భవిష్యత్ కార్యచరణను తెలపనుంది. 

Tags
English Title
Shares of the heavily sunk S Bank
Related News