పాక్ క్రికెట్ బోర్డు బ్రాండ్‌ అంబాసిడర్‌గా అక్తర్‌

Updated By ManamMon, 02/19/2018 - 06:18
aktar

aktarఇస్లామాబాద్‌ : రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌, పాక్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌‌ అక్తర్‌ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు చైర్మెన్ ప్రకటించారు. పీసీబీ ఛైర్మన్‌ నజమ్‌ సేథీతో కలిసి అక్తర్‌ పనిచేయనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా నజమ్ సేథీ వెల్లడించారు. కాగా అక్తర్ స్పందిస్తూ ‘మీతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నా.. పాక్ క్రికెట్ బోర్డు బ్రాండ్ అంబాసిడర్‌గా నాకు అవకాశం లభించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా.. ఉత్తమ సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని ట్విట్టర్లో రిప్లై ఇచ్చాడు.

English Title
Shoaib Akhtar appointed PCB brand ambassador
Related News