ఆదుకున్న షోయబ్ మాలిక్ 

Updated By ManamSun, 09/23/2018 - 23:24
shoib malik
  • పాకిస్థాన్ 237/7  


imageదుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. పాక్ బ్యాట్స్‌మెన్‌లో షోయబ్ మాలిక్ (78), సర్ఫరాజ్ అహ్మద్ (44), ఫకార్ జమాన్ (31), అసీఫ్ అలి(30)లు రాణించడంతో ఆ జట్టు గౌరవ ప్రదమైన స్కోర్ చేయగలిగింది.  అనంతరం లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా కడపటి వార్తలందేసరికి 10 ఓవర్లలో 53/0 పరుగులు చేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ను భారత స్పిన్నర్లు చహల్, కుల్దీప్‌లు ఆరంభంలోనే దెబ్బకొట్టారు. 55 పరుగులకే ఇమామ్ ఉల్ హక్(10), ఫకార్ జమాన్(31)లను పెవిలియన్‌కు చేర్చారు. ఆ వెంటనే బాబర్ ఆజమ్(9) కూడా రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో పాక్ 58 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టల్లో పడింది. 

తర్వాత క్రీజులోకి వచ్చిన షోయమ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్‌లు పాక్‌ను ఆదుకున్నారు. వీరిద్దరు ఆచితూచిగా ఆడుతూ పాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఈ క్రమంలో 64 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ సాయంతో మాలిక్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను కుల్దీప్ చక్కటి బంతితో వీడదీశాడు.  సర్ఫరాజ్ (44) పరుగులు చేసి వెనుదిరిగాడు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 107 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరికొద్ది సేపటికే కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న షోయబ్ మాలిక్  90 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 78 పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత వేగంగా ఆడుతున్న అసిఫ్ అలీ(30)ని చహల్ క్లీన్ బౌల్డ్ చేసి వన్డేల్లో 50వ వికెట్ దక్కించుకున్నాడు.  చివరి ఓవర్లో బుమ్రా షాదాబ్(10)ను ఔట్ చేయడంతో పాక్ నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో చహల్, కుల్దీప్, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు.

English Title
Shoaib Malik
Related News