శోభన, హారీశ్ జైరాజ్‌లకు డాక్టరేట్

Updated By ManamThu, 09/06/2018 - 13:59
Shobana, Harris

Shobana, Harrisప్రముఖ నటి, నాట్యకళాకారిణి శోభన, సంగీత దర్శకుడు హారీశ్ జైరాజ్‌లకు ఎంజీఆర్ విద్యా పరిశోధన సంస్థ గౌరవ డాక్టరేట్‌లను ప్రకటించింది. తమ తమ రంగాల్లో వారు చేసిన కృషికి గానూ ఆ సంస్థ డాక్టరేట్ ఇచ్చి సత్కరించనుంది. ఈ నెల 10న వేలప్పన్ చావడిలోని ఏసీఎస్ కన్వెన్సన్ సెంటర్‌లో జరిగే కార్యక్రమంలో వీరిద్దరికి డాక్టరేట్‌ను ఇవ్వనున్నారు.

వీరితో పాటు విక్రమ్ సారాబాయ్, స్పేస్ డైరక్టర్ సోమనాథ్‌కు డాక్టరేట్ అందించనన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ముఖ్య అతిథిగా పాల్గొననుండగా.. సుమారు 3,300 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలకు అందించనున్నారు.

English Title
Shobana, Harris Jayaraj will receive doctorate
Related News