దర్శకుడు శంక‌ర్‌కు కోర్టు షాక్‌

Updated By ManamTue, 09/04/2018 - 15:22
Shankar

Shankarస్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు చెన్నై హైకోర్టు షాకిచ్చింది. వివ‌రాల్లోకెళ్తే.. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీ కాంత్ న‌టించిన రోబో క‌థ త‌న‌దంటూ ఆరూర్ త‌మిళ‌నాడ‌న్ చెన్నై హైకోర్టులో కేసు వేశారు. పిటిషన్‌ను ప‌లుమార్లు ప‌రిశీలించిన కోర్టు శంక‌ర్‌ను కోర్టుక హాజ‌ర అవ‌మ‌ని కోరింది. అయితే శంక‌ర్ కోర్టుకు హాజ‌రు కాలేదు. దీంతో కోర్టు ఆయ‌న‌కు ప‌దివేల రూపాయ‌ల జ‌రిమానా విధించింది. 2010లో విడుద‌లైన రోబో క‌థ త‌న‌ది కావ‌డంతో త‌న‌కు కోటి రూపాయ‌లు న‌ష్ట ప‌రిహారం ఇవ్వాల‌ని ఆరూర్ త‌మిళ‌నాడ‌న్ కోరారు. ఇప్పుడు శంక‌ర్ దీనికి ఏకంగా సీక్వెల్‌గా 2.0ను తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. 

English Title
Shock to Director Shankar
Related News