వీనస్‌కు షాక్

Updated By ManamSun, 05/27/2018 - 23:39
williamson
  • ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్

venusపారిస్ : ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రోజే సంచలనం నమోదైంది. అవెురికా స్టార్ వీనస్ విలియమ్స్‌కు తొలి రౌండ్‌లోనే షాక్ తగిలింది. మహిళల సింగిల్స్‌లో 9వ సీడ్ వీనస్ విలియమ్స్ 4-6, 5-7 తేడాతో చైనాకు చెందిన అన్ సీడెడ్ కింగ్ వాంగ్ చేతిలో ఘోరంగా పరాజయం చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరో మ్యాచ్‌లో ఉక్రెయిన్ స్టార్ క్రీడాకారిణి నాలుగో సీడ్ ఎలినా స్విట్లోనియా 7-5, 6-3 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన టోమ్లిజనొవిక్‌పై విజయం సాధించి రెండో రౌండ్‌లో దూసుకెళ్లింది. అవెురికా స్టార్ పదోసీడ్ స్టీఫెన్స్ 6-2, 6-0 తేడాతో నెదర్లాండ్‌కు చెందిన అరంట్సా రస్‌ను ఓడించింది. 
రెండో రౌండ్‌లో డిమిట్రోవ్
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో బల్గేరియా స్టార్ డిమిట్రోవ్ 6-1, 6-4, 7-6 తేడాతో ఈజిప్ట్‌కు చెందిన మహ్మద్ సఫ్‌వత్‌ను ఓడించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన డిమిట్రోవ్ తొలి సెట్‌ను ఈజీగా గెలుచుకున్న తర్వాతి సెట్‌లలో మాత్రం ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదుర్కొని  విజయం సాధించి రెండో రౌండ్‌లో ప్రవేశించాడు. ఇతర మ్యాచ్‌ల్లో జపాన్ సంచలనం 19వ సీడ్ నిసికొరి 7-6, 6-4, 6-3 తేడాతో జాన్‌వెర్‌ను ఓడించాడు. స్పెయిన్‌కు చెందిన పదో సీడ్ కర్రెనొ బుస్టా 4-6, 6-1, 7-5, 7-6(7-5) తేడాతో జోసెఫ్ కొవాలిక్ (స్లోవెకియా)పై విజయం సాధించాడు.

English Title
shock to venus
Related News