స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్న శ్రియ‌

Updated By ManamFri, 11/24/2017 - 12:54
shriya

shiryaశ్రియ శరన్.. తెలుగు ఇండస్ట్రీలోకి మంచి పాత్రలతో అడుగుపెట్టిన గ్లామరస్ హీరోయిన్. దశాబ్దం పాటు ఇండస్ట్రీని ఏలిన నాయిక ఈమె. పెర్ఫార్మన్స్ బేస్డ్ కథలకి.. తనకోసమే ఆ క్యారెక్టర్ పుట్టిందా అన్నట్టుగా ఆ పాత్రలో లీనమైపోయే నటీమణి. అందుకే 'సంతోషం', 'నువ్వే నువ్వే', ‘మనం’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో త‌న‌కంటూ ఓ స్థానం ద‌క్కించుకుంది. ప్రస్తుతం శ్రియ నటించిన తమిళ సినిమా ‘నరగాసురన్’.. ఈ మధ్యనే ఊటీలో షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ మూవీని తెలుగులో కూడా ‘నరకాసుర’ పేరుతో డబ్ చేస్తున్న సంగతి విదితమే. 'ధ్రువంగ‌ళ్ ప‌ద‌నారు' (తెలుగులో '16') ఫేమ్‌ కార్తిక్ నరేన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో.. అరవింద్ స్వామితో మొదటి సారిగా జోడి కట్టింది శ్రియ‌. ద‌ర్శ‌కుడు కార్తిక్ ఈ సినిమాలో శ్రియ పాత్ర గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, “శ్రియ అయితే ఈ సినిమాకి బాగా ప్లస్ అవుతుందని భావించి.. తనకోసమే ఆ పాత్రను డిజైన్ చేసాం. త‌న‌ది గ్లామర్ రోల్ కి మాత్రమే పరిమితమయ్యే పాత్ర కాదు. పైగా అరవింద్ స్వామితో కూడా ఇంత‌కుముందు నటించలేదు కాబట్టి ఈ జోడి చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అలాగే ఆమె ఈ మూవీని మరో స్థాయికి తీసుకువెళ్తుంది. అదేవిధంగా త‌న పాత్ర‌తో స‌ర్‌ప్రైజ్ చేస్తుంది” అని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. సందీప్ కిషన్, ఆత్మిక, మ‌ల‌యాళ న‌టుడు ఇంద్ర‌జిత్‌ ఈ సినిమాలో లీడ్ రోల్స్ ని పోషిస్తున్నారు. కాగా, త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు. ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమా తెర‌పైకి రానుంది.

English Title
shriya going to surprise everyone
Related News