నా కుమారుడు అంకితభావమున్న క్రికెటర్

Updated By ManamTue, 01/30/2018 - 18:43
subhamgill

శుభ్‌మన్ గిల్ తండ్రి లఖ్విందర్ సింగ్
subhamgillచండీఘర్: ఇండియా అండర్-19 ప్లేయర్ శుభ్‌మన్ గిల్ తండ్రి లఖ్విందర్ సింగ్ కుమారుని ప్రతిభపై అమితానందాన్ని కనబరిచారు. ‘శుభ్‌మన్ ఎల్లప్పుడు క్రికెట్‌పై అంకిత భావంతో ఉంటాడు. వరల్డ్ కప్‌లో నా కుమారుడు కనబరుస్తున్న ప్రతిభకు ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ సెంచరీ చేసినందుకు, దాయాది జట్టును  ఓడించినందుకు మేమంతా చాలా ఆనందించాం. శుభ్‌మన్‌కు ఇతర ఆట వస్తువులంటే ఇష్టముండేది కాదు. ఎల్లప్పుడు బ్యాట్, బాల్‌తో ఆడేందుకే ఇష్టపడేవాడు. నిద్రకుపక్రమించే సమయంలోనూ బ్యాట్, బాల్‌తో ఆడేవాడు. క్రికెటర్ కావాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు మేమంతా పూర్తి అండగా నిలిచాం. అతను వరల్డ్ క్లాస్ క్రికెటర్ కావడానికి మేము 15 ఏళ్లు శుభ్‌మన్‌కు అంకితం చేశాం. మా పనులను వదిలేసి, కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్‌ను  అంటే మా బంధువుల పెళ్లిళ్లకు కూడా వెళ్లకుండా శుభ్‌మన్ కోసం త్యాగం చేశాం’ లఖ్విందర్ వివరించారు. గిల్ కుటుంబం ఫజిల్కా (పంజాబ్)లోని ఓ గ్రామానికి చెందింది. కానీ ప్రస్తుతం ఈ కుటుంబం మొహాలీలో నివసిస్తోంది. 

Tags
English Title
Shubman Gill Has Always Been a Dedicated Cricketer, Says Father
Related News