అండర్-19 జట్టుపై సిద్ధు ప్రశంసలు

Updated By ManamTue, 01/30/2018 - 18:49
navajithsingh

navajithsinghచండీఘర్: అండర్-19 వరల్డ్ కప్‌లో ఇండియా యువ జట్టు ప్రతిభను పంజాబ్ కేబినెట్ మంత్రి, మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధు ప్రశంసించారు. ఆస్ట్రేలియాతో శనివారం జరగనున్న ఫైనల్లోనూ ఇండియా గెలవాలని ఆయన ఆకాంక్షించారు. అయితే ఇదంతా కోచ్ రాహుల్ ద్రవిడ్ చలవేనన్నారు. భారత యువ క్రికెటర్లను తీర్చిదిద్దడంలో ద్రవిడ్ కీలకపాత్ర పోషించారని.. అందువల్లే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో పృథ్వీ సేన అసాధారణ ప్రతిభ కనబరుస్తోందని సిద్ధు అన్నారు.
 

English Title
Siddhis appreciated the Under-19 team
Related News