సింధీ సంప్రదాయంలో...

Updated By ManamSat, 09/08/2018 - 02:35
deepika

బాలీవుడ్ జంట రణవీర్ సింగ్, దీపికా పదుకొన్ ఈ సంవత్సరం నవంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటి కానున్న విషయం తెలిసిందే. వీరి వివాహం ఏ పద్ధతిలో జరగనుందనే విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే సింధీ సంప్రదాయ పద్ధతిలోనే ఈ వివాహం జరిపించడానికి రణవీర్ సింగ్ కుటుంబ సభ్యులు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. వారి సంప్రదాయ దుస్తులు, వంటకాలు, వివాహ పద్ధతి ప్రకారం ఉండాలని భావిస్తున్నారు.

image


స్నేహితులు, బంధువులు పెళ్లి కుమారుడి వస్త్రాలను చంపే సంప్రదాయమైన సాంత్ కార్యక్రమం కూడా పెళ్ళిలో ఉండాలని చెబుతున్నారు. దీపికా, రణ్‌వీర్‌ల వివాహం ఇటలీలోని ఓ సుందర సరస్సు సమీపాన అత్యంత వేడుకగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. 

English Title
In the Sindhi tradition ...
Related News