సింధు శుభారంభం

Updated By ManamWed, 10/24/2018 - 01:03
Sindhu
  • ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్

sindhuపారీస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. డెన్మార్క్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన సింధు ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం రెండో రౌండ్‌లో ప్రవేశించింది. మంగళవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌లో తొలి రౌండ్లో మూడో సీడ్ సింధు 21-17, 21-8 తేడాతో అవెురికాకు చెందిన బెవెన్ ఝాంగ్‌ను చిత్తు చేసింది. గత కొన్ని టోర్నీలలో వరుసగా విఫలమవుతున్న సింధు ఈ సారి ఫైనల్స్ వరకు చేరుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచే సింధు దూకుడైన ఆటను కనబర్చంది. అయితే తొలి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. దీంతో తొలి గేమ్ హోరాహోరీగా సాగింది. అయితే చివర్లో సింధు ప్రత్యర్థిపై ఆధిక్యాన్ని సాధించి తొలి గేమ్‌ను 21-17తో గెలుచుకుంది. ఆ తర్వాత రెండో గేమ్‌లో ఆరంభం నుంచే సింధు ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగింది. అవెురికా ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌పై పూర్తి ఆధిక్యాన్ని సాధించింది. దీంతో సింధు 21-8తో రెండో గేమ్‌తో పాటూ మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది. 

Tags
English Title
Sindhu is beginning
Related News