సింధు శుభారంభం

Updated By ManamTue, 09/18/2018 - 23:51
Sindhu
  • సైనా ఔట్.. చైనా ఓపెన్  

చాంగ్‌జౌ: చైనా ఓపెన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు శుభారంభం చేసింది. ఈ టోర్నీలో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు తొలి రౌండ్‌లో జపాన్‌కు చెందిన కవకమిపై 21-15, 21-13తో విజయం సాధించింది. దీంతో సింధు ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. అయితే ఈ టోర్నీలో మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నిరాశపరిచింది. తొలి రౌండ్‌లో కొరియాకు చెందిన సుంగ్ జి హ్యూన్‌తో తలపడిన సైనా 22-20, 8-21, 14-21తో ఓటమి చవిచూసింది. తొలి గేమ్‌లో హోరాహోరీగా తలపడిన సైనా రెండో గేమ్‌లో మాత్రం హ్యూన్‌ను నిలువరించలేకపోయింది.

image


ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ తడబడిన నేహ్వాల్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్ర్కమించి ఇంటి ముఖం పట్టింది. 2014లో సైనా చైనా ఓపెన్ టైటిల్‌ను దక్కించుకుంది. ఈ టైటిల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది. ఇక పురుషుల డబుల్స్‌లో మను అట్రి- సుమీత్ రెడ్డీ జోడీ రెండో రౌండ్‌కు దూసుకె ళ్లింది. తొలి రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన మిన్ చున్- చింగ్ హెంగ్‌పై మను అట్రి - సుమీత్ జోడీ 13-21, 21-13, 21-12తో విజయం సాధించింది.

English Title
Sindhu good beginning
Related News