క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్

Updated By ManamFri, 11/09/2018 - 02:48
sindhu
  • చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ

sindhuఫుజౌ(చైనా): టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చైనా ఓపెన్‌లో మరో అడుగు ముందుకు వేసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో థాయిలాండ్ షట్లర్ బుసానన్‌పై సింధు విజయం సాధించింది. సింధు 21-12, 21-15తో గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఆరంభం నుంచే ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించిన సింధు.. తొలి గేమ్‌ను 21-12తో కైవసం చేసుకుంది. అనంతరం అదే జోరు కొనసాగించి 21-15తో రెండో గేమ్‌నూ గెలుచుకుంది. 2016లో టైటిల్ గెలిచిన సింధు తర్వాత జరగబోయే మ్యాచ్‌లో బిన్‌గిజియోతో పోటీపడనుంది.  అంతకుముందు పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ కూడా క్వార్టర్ పైనల్లో అడుగు పెట్టాడు. రెండో రౌండ్‌లో ఇండోనేషియా ఆటగాడు టామీ సుగియార్టోతో జరిగిన పోరులో 10-21, 21-9, 21-9తో కిదాంబి విజయం సాధించి క్వార్టర్స్‌కి చేరుకున్నాడు. తొలి గేమ్‌ను 10-21తో కోల్పోయిన కిదాంబి ఆ తర్వాత నుంచి ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించాడు. ఈ క్రమంలో వరుసగా రెండు, మూడు గేమ్‌లను 21-9, 21-9తో నెగ్గి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. 2014లో చైనా ఓపెన్ టైటిల్‌ను గెలుపొందిన శ్రీకాంత్ తర్వాత జరగబోయే పోరులో చైనీస్ తైపీకు చెందిన చో తైన్ చెన్‌తో తలపడనున్నాడు. 

Tags
English Title
Sindhu, Sindhu in the quarterfinals
Related News