రోడ్డు ప్రమాదంలో సింగర్ మృతి

Updated By ManamWed, 06/20/2018 - 10:03
car accident

kishore నెల్లూరు: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుస్వర సింగర్ కిశోర్ మృతి చెందగా, మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. సంగం మండలం దువ్వూరు వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. నెల్లూరుకు చెందిన సుస్వర ఆర్కెస్ట్రా మైదుకూరులో తమ ప్రోగ్రాంను ముగించుకొని టెంపోలో తిరిగి వస్తుండగా టైర్ పంచర్ అవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న కిశోర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వారికి సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది.

English Title
Singer killed in Road Accident
Related News