హీరోయిన్స్ ఎందుకు రారు: శివాజీ రాజా ఫైర్

Updated By ManamTue, 02/13/2018 - 17:04
sivaji raja

sivaji raja హీరోయిన్లు ‘మా’ అసోషియేషన్‌కు సహకరించాలని, తోకాడిస్తే మాత్రం కత్తిరిస్తామని శివాజీ రాజా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. శివాజీ రాజా ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఓ కారణముంది. అదేంటంటే.. ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) 25 వసంతాలు పూర్తిచేస్తుకున్న సందర్భంగా అమెరికాలోని డల్లాస్‌లో ఏప్రిల్ 28న టాలీవుడ్ అతిరథ మహారథుల సమక్షంలో భారీ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ ఈవెంట్ కర్టైన్ రైజర్ వేడుకలో ‘మా’ అధ్యక్షుడు, నటుడు శివాజీ రాజా హీరోయిన్లపై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈవెంట్‌కు ఎవరైనా ఒకరిద్దరు హీరోలు రాకపోయినా మాకు బాధ లేదని, వాళ్ల ఫ్యాన్సే బాధపడతారని శివాజీ రాజా చెప్పాడు.

ఈవెంట్‌కు హాజరుకావాలని హీరోయిన్లను బతిమాలుతున్నామని వ్యాఖ్యానించాడు. మా రాష్ట్రానికొచ్చి మీరు కోట్లకు కోట్లు తీసుకుంటున్నారని, ఎందుకు ‘మా’ సంస్థకు సహకరించడం లేదని హీరోయిన్లను శివాజీ రాజా ప్రశ్నించాడు. ఎప్పుడూ ఇలాంటి ఈవెంట్లకు హాజరుకావాల్సిందేనని హీరోయిన్లపై సీరియస్ అవ్వలేదని, ఎప్పుడూ అమ్మా.. అమ్మా అంటూ బతిమాలామని చెప్పాడు. ఒకరిద్దరు వస్తున్నారని, మిగిలిన వారు మేనేజర్లపై తోసేస్తున్నారని తెలిపాడు. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉంటున్నామని, చాలామంది హీరోలను, హీరోయిన్లను చూశామని.. పరిస్థితి పీకల మీదకు తెచ్చుకోవద్దని శివాజీ రాజా హీరోయిన్లను హెచ్చరించాడు.

English Title
sivaji raja fires on heroiens
Related News