సిక్స్‌ప్యాక్‌తో  సిద్ధం...

Updated By ManamMon, 09/24/2018 - 01:32
akhil

imageఇప్పటి కథానాయకులందరూ లుక్ పరంగానే కాదు.. ఫిజిక్ పరంగా బాలీవుడ్ కథానాయకులతో పోటీ పడుతున్నారు. అందులో భాగంగా కుర్ర హీరోల్లో చాలా మంది ఆరు పలకల దేహంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరి గ్రూపులో ఇప్పుడు అక్కినేని నట వారసుడు అఖిల్ కూడా చేరారు. ఈయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ మజ్ను’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ సిక్స్ ప్యాక్‌తో సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో అఖిల్ ప్లేబాయ్ పాత్రలో కనిపించనున్నారు. రీసెంట్‌గా లండన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో చిత్రీకరణను జరపుకోనుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు నిర్మాతలు. 

English Title
with six pack
Related News