ఆ పాము మృతితో వెక్కి వెక్కి ఏడ్చారు

Updated By ManamThu, 08/02/2018 - 17:06
snake

snake పిఠాపురం: గత 26రోజులుగా తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలోని ప్రజలు దేవుడిగా కొలుస్తూ పూజలు చేస్తున్న పాము గురువారం మృతి చెందింది. బుధవారం కుబుసం విడిచిన పాము అనుకోకుండా మృతి చెందడంతో ఆ గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు.

అయితే 26రోజుల క్రితం దుర్గాడ గ్రామంలోని ఓ రైతు పొలంలో ఈ పాము కనిపించింది. దాని దగ్గరికి వెళ్లినా అది ఎవరినీ కాటు వేయకపోవడంతో సుబ్రమణ్య స్వామి స్వరూపం అంటూ గ్రామస్థులు పూజలు చేస్తూ వస్తున్నారు. ఆ పాము విషపూరితమైందని, దాన్ని అక్కడి నుంచి తరలించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించగా.. గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో ఏమీ చేయలేక అటవీ అధికారులు వెనక్కి తిరిగారు. ఇక ఆ పాముకు గుడి కట్టాలని అనుకుంటుండగా.. అంతలోపే పాము మరణించింది. దీంతో గ్రామస్థులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పాము మృతి చెందిన స్థలంలోనే గుడి కట్టాలని గ్రామ ప్రజలు భావిస్తున్నారు. కాగా మరోవైపు ఈ పాము మరణించడానికి గొల్లప్రోలు ఎస్సై శివకృష్ణ కారణమంటూ దుర్గాడ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఆ ఎస్సైను సస్పెండ్ చేయాలని గ్రామస్థులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు.

English Title
Snake died in Durgada village
Related News