వీడియో: గుడ్లను మింగలేక కక్కేసిన నాగుపాము

Updated By ManamTue, 03/13/2018 - 16:46
Snake swallows eggs, lunch, throws up

Snake swallows eggs, lunch, throws upచిక్కమంగళూరు: పాము గుడ్లు తింటుందా? అసలు పాము గుడ్లను తినగలదో లేదో తెలియదుగానీ ఇక్కడ నాగుపాము మాత్రం గుడ్లను మింగలేక కక్కేసింది. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే ఓ యువకుడి ఇంటి ప్రాంగణంలో నాగుపాము తారసపడింది. దాంతో ఆ నాగుపాముకు అతడు గుడ్లను ఆహారంగా ఇచ్చాడు. విసిరిన మూడు గుడ్లను అమాంతం లొట్టలేసుకుంటూ మింగిన నాగుపాము విలవిలలాడిపోయింది. ఆ గుడ్లను మొత్తం మింగలేక, వాటిని జీర్ణించుకోలేక పాము పాట్లు పడింది. చివరికి, అలిసిపోయిన నాగుపాము మింగిన ఒక్కొక్క గుడ్డును బయటకి కక్కేసి ఇలా ఊపిరి పీల్చుకుంది. పాము గుడ్లను కక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూడండి.. 

English Title
Snake swallows eggs for lunch, throws up
Related News