అలాగా.. అగ్నిపర్వతాన్ని అడుగుతా!

Updated By ManamFri, 08/10/2018 - 00:21
sushma

imageన్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ.. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు వింత పరిస్థితి ఏర్పడింది. సుశీల్ కే రాయ్ అనే వ్యక్తి సుష్మను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. అందులో.. ‘‘ బాలీకి వెళ్లడం క్షేమమేనా? ఈ నెల  11-17 మధ్య  ఇండొనేషియాలోని బాలీకి వెళ్లాలనుకుంటున్నాను.  అక్కడ అగ్నిపర్వతం పేలిందని విన్నాం. మరి అక్కడికి  వెళ్ళడం సురక్షితమేనా? మన ప్రభుత్వం ఏదైనా సూచనను విడుదల చేసిందా? వివరాలుంటే తెలపండి’’ అని ఆ వ్యక్తి కోరారు. దీనికి సుష్మా స్వరాజ్ బదులిస్తూ ‘‘నేను అగ్ని పర్వతాన్ని సంప్రదించాలి’’ అని సుష్మాస్వరాజ్ సరదాగా ట్వీట్ చేశారు.

English Title
So let's ask volcano!: sushma
Related News