భార్య విషయంలో గొడవ.. తండ్రిని చంపిన కొడుకు

Updated By ManamWed, 08/01/2018 - 14:54
singarayakonda

singarayakondaప్రకాశం: మానవత్వం మంటగలుస్తోంది. నవమోసాలు కనిపెంచి పోషించి పెద్ద చేసి ఒకింటోళ్లను చేసిన తల్లిదండ్రులను పూవుల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బిడ్డలు అలా చూసుకోకపోగా వారిని కాటికి పంపుతుండటం గమనార్హం.! ఆస్తికోసం, మద్యానికి డబ్బులివ్వలేదని ఇలా తల్లిదండ్రులను కొట్టి చంపిన సందర్భాలు కోకొల్లలు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చదువుకున్న, నాలుగు విషయాలు తెలిసిన వారే ఇలాంటి ఘటనలకు పాల్పడుతుండటం గమనార్హం.

తాజాగా.. ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో దారుణం చోటు చేసుకుంది. తన భార్య పట్ల తండ్రి అసభ్యంగా ప్రవర్తించాడని కుమారుడు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి కాటికి పంపేశాడు.! తండ్రి నిజంగానే అసభ్యంగా ప్రవర్తించాడా..? లేదా అని కనీసం ఒక్క మాట కూడా అడగకుండానే ఆయనపై గొడవ దిగాడు కుమారుడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆ చిన్నపాటి గొడవ కాస్త ఘర్షణకు దారిదీసింది. ఆ క్షణికావేశంతో తండ్రి అని చూడకుండానే కొడుకు చంపేశాడు. అనంతరం భార్యతో కలిసి ఇంట్లోనుంచి పరారయ్యాడని సమాచారం. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

English Title
Son Killed Father Over Wife Issue In Singarayakonda Prakasam Dist
Related News