నా పరిస్థితిని వీడు అర్థం చేసుకున్నాడు

Updated By ManamThu, 07/19/2018 - 13:00
Sonali

sonali క్యాన్సర్‌తో బాధపడుతున్న నటి సోనాలి బింద్రే ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ వ్యాధితో పోరాడి గెలుస్తానన్న నమ్మకం తనకు ఉందని ఇటీవల పేర్కొన్న ఆమె.. తాజాగా తన కుమారుడి గురించి ఓ భావేద్వేగపు పోస్ట్‌ను చేశారు.

‘‘12 సంవత్సరాల, 11 నెలల, 8 రోజుల క్రితం వీడి పుట్టి నా హృదయాన్ని సంతోషింపజేశాడు. ఆ రోజు నుంచి ఇప్పటివరకు నేను, గోల్డీ బెల్ వాడి సంతోషం కోసం చాలా చేశాం. అయితే నాకు క్యాన్సర్ ఉందని తెలిసినప్పుడు, ఈ విషయాన్ని వాడికి ఎలా చెప్పాలా అని చాలా ఆలోచించాం.

వాడికి అన్ని నిజాలను తెలపాలని మేము అనుకున్నాం. ఇంతవరకు వాడితో మేము చాలా నిజాయితీగా ఉన్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు. అయితే నా వ్యాధిపై వాడు చాలా పరికత్వతో ఆలోచించాడు. కొన్నిసార్లు నాకు తల్లిగా మారుతూ.. నేను చేయాల్సినవి గుర్తుచేస్తున్నాడు.

ఇలాంటి విషయాలు పిల్లలకు చెప్పడం చాలా కష్టమని నేను భావిస్తాను. ఈ సమయంలో నేను కోలువడానికి చాలా మంది నన్ను ఉత్సహపరుస్తున్నారు. ఇప్పుడు వారందరి కోసం సమయం కేటాయించడం చాలా అవసరం. ఇప్పుడు నేను నా సమయాన్ని రణ్‌వీర్‌తో గడుపుతున్నాను. వాడికిప్పుడు వేసవి సెలవులు. వాడి అల్లరి కొత్త జీవితం ప్రారంభించేందుకు నాకు సాయం చేస్తోంది. ఈ రోజు మేమిద్దరం ఒకరికొకరు ధైర్యాన్ని ఇచ్చుకుంటున్నాం’’ అంటూ ఆమె రాశారు.

English Title
Sonali Bendre emotional about his son
Related News