విపక్ష నేతలకు సోనియా డిన్నర్ పార్టీ

Updated By ManamTue, 03/13/2018 - 21:49
sonia gandhi
sonia gandhi

న్యూఢిల్లీ: యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ విపక్ష నేతలకు డిన్నర్ పార్టీ ఇచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ఎన్డీయే కూటమికి ధీటుగా యూపీఏ కూటమిని బలోపేతం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగానే సోనియాగాంధీ మిత్రపక్షాల నేతలకు డిన్నర్ పార్టీ ఇచ్చారని తెలుస్తోంది. 

సోనియా నివాసం 10-జన్‌పథ్‌లో జరిగిన ఈ డిన్నర్ పార్టీకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత రాంగోపాల్ యాదవ్, బీఎస్పీ సీనియర్ నేత సతీశ్ మిశ్రా, జార్ఖండ్ వికాస్ మోర్చ నేత బాబూలాల్ మరాండి, డీఎంకే ఎంపీ కణిమొళి, ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, నేషనల్ కాన్ఫెరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తదితరులు హాజరయ్యారు. 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్,  ఆ పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే తదితరులు కూడా డిన్నర్ పార్టీలో పాల్గొన్నారు. ఈ డిన్నర్ పార్టీ వెనుక రాజకీయాలు లేవన్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి రన్‌దీప్ సుర్జేవాలా...స్నేహపూర్వకంగానే దీన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

 

English Title
Sonia Gandhi meets opposition leaders over dinner, Congress says 'no politics, just friendship'
Related News