నాలుగేళ్ల తరువాత టాలీవుడ్‌కు క్రేజీ విలన్

Updated By ManamMon, 09/10/2018 - 11:31
Sonu Sood

Sonu Soodఒకప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ విలన్‌గా పేరు తెచ్చుకున్న సోనూసూద్.. నాలుగేళ్ల తరువాత టాలీవుడ్‌లోకి రాబోతున్నాడు. ‘అరుంధతి’, ‘జులాయి’, ‘ఆగడు’, ‘సూపర్’, ‘అతడు’ వంటి చిత్రాల్లో నటించి అందరినీ మెప్పించిన సోనూసూద్.. ఈ మధ్య తమిళ్, హిందీ చిత్రాలలో బిజీగా ఉన్నాడు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ తెరకెక్కిస్తున్న చిత్రం ద్వారా ఈ విలన్ మళ్లీ తెలుగులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో సోనూసూద్ రాజకీయ నాయకుడిగా కనపడనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో బెల్లంకొండ సరసన కాజల్ నటిస్తుండగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. కాగా 2014లో సోనూసూద్ తెలుగులో ఆగడులో సోనూసూద్ చివరిగా నటించాడు.(ఆ తరువాత 2016లో అభినేత్రితో వచ్చినప్పటికీ.. అది స్ట్రైట్ తెలుగు సినిమా కాదు.)

English Title
Sonu Sood make his comeback to tollywood
Related News