సౌతాఫ్రికాకు షాక్.. ముగ్గురు కీలక ఆటగాళ్లు ఔట్!

Updated By ManamTue, 02/13/2018 - 21:50
bumrah

bumrahపోర్ట్ఎలిజిబెత్‌: దక్షిణాఫ్రికా, టీమిండియా మధ్య జరుగుతున్న ఐదే వన్డేలో ఆతిథ్య జట్టుకు భారత బౌలర్లు షాకిచ్చారు. 13 ఓవర్లలో 65 పరుగులకే మూడు కీలక వికెట్లు పడగొట్టి సత్తా చాటారు. కెప్టెన్ మార్‌క్రమ్ బూమ్రా బౌలింగ్‌లో కోహ్లీ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. 32 పరుగులు చేసిన మార్‌క్రమ్ 4ఫోర్లు, సిక్స్ కొట్టాడు. హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో మరో కీలక బ్యాట్స్‌మెన్ డుమ్నీ రోహిత్‌కు క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. డుమ్నీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. డివిలియర్స్‌ను కూడా పాండ్యానే ఔట్ చేశాడు. హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో డివిలియర్స్ ధోనీకి కీపర్ క్యాచ్‌గా దొరికి వెనుదిరిగాడు. ఇలా మూడు కీలక వికెట్లను దక్షిణాఫ్రికా ఆదిలోనే కోల్పోయింది. బ్యాటింగ్‌లో ఫెయిలైన ఆల్‌ రౌండర్ ఆటగాడు హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో మాత్రం సత్తా చాటాడు.

English Title
south africa losses three wicketsRelated News