దక్షిణాది క్వీన్స్

Updated By ManamSat, 10/20/2018 - 00:20
Southern Queens

కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘క్వీన్’. పెద్ద విజయాన్ని సాధించిన ఈ చిత్రం కంగనాకు స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను తెచ్చి పెట్టింది. ఈ సినిమాను దక్షిణాదిన నాలుగు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ పేరుతో రీమేక్ అవుతుంది. ఐఫిల్ టవర్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అమాయకంగా ఉండే ఓ అమ్మాయి.. జీవితంలో ఎదురైన కొన్ని పరిస్థితుల వల్ల శక్తివంతమైన మహిళగా ఎలా మారుతుంది అనేదే కథ.

image


అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి.. మైఖేెల్ టబూరియస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తైజాన్ ఖొరాకివాలా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మీడియెంట్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో మను కుమరన్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తమిళంలో కాజల్ ప్రధాన పాత్రలో ‘పారిస్ పారిస్’.. కన్నడలో పారుల్ యాదవ్ ప్రధాన పాత్రలో ‘బటర్ ఫ్ల్లై, మంజిమ మోహన్ ప్రధాన పాత్రలో మలయాళంలో ‘జామ్ జామ్’గా క్వీన్ రీమేక్ అవుతుంది. 
 

English Title
Southern Queens
Related News