దిగుమతి సుంకాలపై అమెరికాతో మాట్లాడతాం

Updated By ManamTue, 03/13/2018 - 22:25
suresh-prabhu

suresh-prabhuన్యూఢిల్లీ: ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ అవెురికా తీసుకున్న ‘‘దురదృష్టకర’’ నిర్ణయాన్ని మార్చుకోవలసిందిగా కోరుతూ, ఆ అంశాన్ని అవెురికా అధికారుల దృష్టికి తీసుకెళతామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్లు ట్రంప్ ప్రభుత్వం గత వారం ప్రకటించింది. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం తలెత్తవచ్చనే భయాలను అది రేకెత్తించింది. ‘‘ఈ నిర్ణయాలు దురదృష్టకర
మైనవి. అవెురికా వాణిజ్య మంత్రితో నేను వీటిపై మాట్లాడతాను. బహుళ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం, ద్వైపాక్షిక వాణిజ్య వేదిక రెండింటి ద్వారాను కలసి పనిచేయాల్సిన అవసరం గురించి వారికి వివరించేందుకు నేను తప్పకుండా ప్రయత్నిస్తాను’’ అని ఆయన అన్నారు. భారతదేశం ఆ రెండు ఉత్పత్తులను ఏటా 1.3 బిలియన్ డాలర్ల విలువైనవి అవెురికాకు ఎగుమతి చేస్తోంది. కనుక సుంకాల పెంపు ప్రభావంపై మంత్రిత్వ శాఖ ఇప్పటికే అధ్యయనం ప్రారంభించింది. అవెురికా ప్రభుత్వ సుంకాలతో అవెురికన్ మార్కెట్‌కు ఈ ఉత్పత్తుల ఎగుమతుల ధరలు వ్యయదాయకమైనవిగా తయారవుతాయి. ఫలితంగా, దేశీయ వస్తువుల పోటీ సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. దీనిపై యూరోపియన్ యూనియన్, చైనాలు ప్రతి చర్యలకు దిగవచ్చని, ఆ వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తుందని ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ పేర్కొంది. ఈ చర్య వల్ల వివిధ దేశాల నుంచి అవెురికాకు ఉక్కు ఎగుమతి 9-14 మిలియన్ టన్నులు తగ్గే అవకాశం ఉందని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక కూడా పేర్కొంది. అవెురికాకు ఎగుమతయ్యే ఉక్కు ఉత్పత్తుల్లో 60 శాతం కెనడా, బ్రెజిల్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా దేశాల నుంచే ఉంది. ఇండియా నుంచి 2017లో అవెురికాకు 0.9 మిలియన్ టన్నుల ఉక్కు ఎగుమతి అయింది. ఈ విషయమై అవెురికాను ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.ఓ) వివాద పరిష్కార యంత్రాంగానికి లాగాలని కొందరు వాణిజ్య నిపుణులు సూచిస్తున్నారు. మార్చి 19-20 తేదీల్లో ఇండియాలో డబ్ల్యు.టి.ఓ సభ్యుల మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగనుంది. అవెురికా, చైనాల ప్రతినిధులు కూడా పాల్గొనడానికి అవకాశం ఉన్న ఈ సమావేశంలో ఆ అంశాలు చర్చకు రావచ్చు. ఈ సమావేశాన్ని ‘‘ఒక స్నేహపూర్వక వాతావరణం సృష్టించడం కోసమే ఏర్పాటు చేశాం. అంతర్జాతీయ వాణిజ్య, బహుళ వ్యాపార వర్తక వ్యవస్థ చుట్టూ ఉన్న ఈ ప్రతికూలత తగ్గుతుంది. స్వేచ్ఛా వర్తకం ద్వారా అన్ని దేశాలు లబ్ధి పొందుతాయి’’ అని సురేశ్ ప్రభు ఒక ఇంటర్వ్యూలో అన్నారు. 

English Title
Speak to the United States on import tariffs
Related News