'ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాం'

Updated By ManamTue, 09/18/2018 - 16:40
Special status, AP people, congress party, Rahul Gandhi, former CM Sanjeevaiah 

Special status, AP people, congress party, Rahul Gandhi, former CM Sanjeevaiah కర్నూలు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన కర్నూలులో ఏర్పాటుచేసిన సత్యమేవ జయతే సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని, కాంగ్రెస్ పార్టీకి ఏపీతో ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. తొలి దళిత ముఖ్యమంత్రిగా సంజీవయ్యను చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడ చూసినా అవినీతిమయమని, ఏపీలోనూ అవినీతికి మినహాయింపు లేదని విమర్శించారు. సంజీవయ్య అవినీతిపరుడని జవహర్ లాల్ నెహ్రూకు ఫిర్యాదు చేశారని, నిజానిజాలు తెలుసుకునేందుకు నెహ్రూ కర్నూలుకు ఓ ఒప్పందాన్ని పంపారని తెలిపారు. అవినీతి ఆరోపణలు తప్పని తేలడంతో నెహ్రూ సంజీవయ్యను ఏపీ ముఖ్యమంత్రిని చేశారని రాహుల్ గుర్తు చేశారు. 

సంజీవయ్య లాంటి ముఖ్యమంత్రి ఏపీకి కావాలని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ఏపీకి కేంద్రం నుంచి ప్రత్యేక సాయం, మద్దతు అందాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై ఏపీకి నాటి ప్రధాని సభలో హామీ ఇచ్చారని, ఉద్యోగాల కల్పనలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రతిరోజు చైనా 50వేల ఉద్యోగాలు సృష్టిస్తోందని, అదే మనదేశంలో 450 ఉద్యోగాలు మాత్రమే లభిస్తున్నాయని అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ కొందరి చేతుల్లో చిక్కుకుపోయిందని విమర్శించారు. ఏపీలో స్వయం సహాయక సంఘాల పనితీరు బాగుందని, మిగతా రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయని రాహుల్ తెలిపారు. 

English Title
Special status to AP after Congress comes to power in central 
Related News