శ్రీలంక కెప్టెన్, కోచ్‌లపై నిషేధం

Updated By ManamMon, 07/16/2018 - 23:28
CHANDIMAL
  •  బాల్ టాంపరింగ్ వివాదం

CHANDIMALదుబాయ్: వెస్టిండీస్ పర్యట నలో బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమల్, కోచ్ చంద్రిక హతురుసింఘేలతో పాటు మేనేజర్ అసంక గురుసిన్హాలపై నాలుగు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌ల నిషేధం పడింది. దీంతో సౌతాఫ్రికాతో ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న సిరీస్‌లో రెండో టెస్టు, తర్వాత జరగనున్న వన్డే సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లకు వీళ్లు దూరమయ్యారు. క్రికెట్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ ముగ్గురు ప్రవర్తించినట్టు తేలడంతో వీరిపై నిషేధపు వేటు పడింది. ఈ ఏడాది ఆరంభంలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండిపెండింట్ జుడీషియల్ కమిషనర్ గౌరవ మైకెల్ బలాఫ్ క్వీన్స్ కౌన్సిల్ ఈ ముగ్గురికి ఎనిమిది సస్పెన్షన్ పాయింట్లు ఇచ్చారు. ఎనిమిది సస్పెన్షన్ పాయింట్స్ అంటే ఐసీసీ నిబంధనల ప్రకారం రెండు టెస్టులు, నాలుగు వన్డేలు లేదా ఎనిమిది వన్డేలు/టీ20ల నిషేధం పడుతుంది. ఇందులో ఏది ముందుగా ఉంటే అది అమల్లోకి వస్తుంది. 

Tags
English Title
Sri Lankan captain and coaches are banned
Related News