‘శ్రీనివాస కళ్యాణం’ రివ్యూ

Updated By ManamThu, 08/09/2018 - 14:44
Srinivasa Kalyanam Review
Srinivasa Kalyanam

గ‌త ఏడాది వ‌రుస విజ‌యాలు అందుకున్న దిల్‌రాజు నిర్మాత‌గా ఈ ఏడాది విడుద‌లైన చిత్రం `శ్రీనివాస క‌ళ్యాణం`. మ‌న తెలుగు సంప్ర‌దాయాన్ని, గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేసే అంశాల్లో పెళ్లి ఒక‌టి. కాబ‌ట్టి ఈ అంశం చుట్టూ ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న క‌థ‌ను రాసుకున్నాడు. అయితే తెలుగులో పెళ్లి, బంధువులు, సంబంధాలు ఇలాంటి అంశాల‌పై చాలానే సినిమాలు వ‌చ్చాయి. మ‌రి శ్రీనివాస‌క‌ళ్యాణం ప్రేక్ష‌కుల‌ను ఏ మేర మెప్పించిందో తెలుసుకోవాలంటే ముందుగా క‌థ గురించి తెలుసుకుందాం....

స‌మ‌ర్ప‌ణ‌:  శ్రీమ‌తి అనిత‌
బ్యాన‌ర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 
న‌టీన‌టులు: నితిన్, రాశీ ఖన్నా,నందితా శ్వేత‌, పూన‌మ్‌కౌర్‌, జ‌య‌సుధ‌, ఆమ‌ని, సితార‌, సీనియ‌ర్ న‌రేశ్‌, ప్ర‌కాష్‌రాజ్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌దిత‌రులు
సంగీతం: మిక్కీ జె మేయర్ 
కెమెరా: స‌మీర్ రెడ్డి
ఎడిటింగ్‌:  కూర్పు
నిర్మాత‌లు:  దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్
ద‌ర్శ‌క‌త్వం:  సతీష్ వేగేశ్న‌

క‌థ‌:
నాన్న‌మ్మ‌(జ‌య‌సుధ‌) మాట‌ల ప్ర‌కారం పెళ్లంటే పండుగ‌లా ఉంటుంద‌ని శ్రీనివాస్‌(నితిన్‌)కి తెలుస్తుంది. కాబ‌ట్టి త‌న పెళ్లి కూడా అలా పండుగ‌లా జ‌ర‌గాల‌నుకుంటాడు. త‌ను ఉమ్మ‌డి కుటుంబంతో ఉండ‌టం వ‌ల్ల బంధాలు, బంధుత్వాల‌కు ఎక్కువ విలువ ఇస్తుంటాడు. ఆర్కిటెక్చ‌ర్స్ ప‌నిమీద చంఢీగ‌ర్ వెళ్లిన‌ప్పుడు అక్కడ హైదరాబాద్‌లో పెద్ద బిజినెస్‌మేన్ కూతురు సిరి(రాశీ ఖ‌న్నా)ని చూస్తాడు. ఆమె ఎవ‌రో తెలియ‌కుండానే ప్రేమిస్తాడు. ఆమె కూడా శ్రీనివాస్ గురించి తెలిసి ప్రేమిస్తుంది.

రెండు కుటుంబాల‌కు వీరి ప్రేమ విష‌యం తెలిస్తుంది. శ్రీనివాస్ ఇంట్లో త్వ‌ర‌గానే ఒప్పుకుంటారు. అయితే స‌మ‌యాన్ని డ‌బ్బుతో లెక్క చూసే ఆర్‌.కె.. కూతురు కోసం పెళ్లికి ఒప్పుకుంటాడు. అయితే శ్రీనివాస్‌కి ఓ కండీష‌న్ పెడ‌తాడు. శ్రీనివాస్ కూడా ఆర్‌.కెకి ఓ కండీష‌న్ పెడ‌తాడు. ఇంత‌కు ఒక‌రికొక‌రు ఎలాంటి కండీష‌న్స్ పెట్టుకుంటారు?  చివ‌ర‌కు ఎవ‌రు గెలుస్తారు?  శ్రీనివాస్‌, సిరి ఒక‌ట‌వుతారా?  అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...

Srinivasa Kalyanam

సమీక్ష:
ద‌ర్శ‌కుడు పెళ్లి అనే అంశం చుట్టూ క‌థ‌ను అల్లుకున్నాడు. పెళ్లి అంటే రెండు కుటుంబాలు. అందులోనూ ఒక‌టి ఉమ్మ‌డి కుంటుంబం కాబ‌ట్టి క్యారెక్ట‌ర్స్ ఎక్కువ‌గా ఉంటాయి. కాబ‌ట్టి ప్ర‌తి క్యారెక్ట‌ర్‌కు ప్రాముఖ్య‌త‌ను ఇచ్చుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక ప్ర‌థమార్థం అంతా హీరో, హీరోయిన్ ప్రేమ‌.. స‌న్నివేశాలు.. సాంగ్స్‌.. ఫ్రెండ్స్‌.. ప్రేమ గురించి తెలియ‌డం .. పెళ్లి ప్ర‌స్తావ‌న ద‌గ్గ‌ర ట్విస్ట్ తో ఫ‌స్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ అంతా పెళ్లి చుట్టూనే తిరుగుతుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో కాస్త నాట‌కీయ‌త‌తో సినిమా ముగుస్తుంది. అయితే ద‌ర్శ‌కుడు హీరోనితిన్‌, హీరోయిన్స్ రాశీఖ‌న్నా, నందితా శ్వేతా పాత్ర‌ల‌ను  స‌రిగ్గా డిజైన్ చేసుకోలేద‌నిపించింది.

క‌థ‌లో కొత్త‌ద‌నం లేదు.. ఏదో స‌న్నివేశాల‌ను రిచ్‌గా.. ఫ్రెష్ లుక్‌తో చూపించేసి ర‌న్ చేయిస్తామంటే ప్రేక్ష‌కుడు సినిమాకు క‌నెక్ట్ కావ‌డం క‌ష్ట‌మే. జ‌య‌సుధ‌, ప్రకాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, సీనియ‌ర్ న‌రేశ్‌, ఆమ‌ని, సితార‌, ప్ర‌భాస్ శ్రీను, ప్ర‌వీణ్‌, విద్యుల్లేఖ అంద‌రూ వారి పాత్ర‌ల‌కు న్యాయం చేసినా ఇంత‌కు ముందు ప్ర‌స్తావించిన‌ట్లు పాత‌్రలు క‌నెక్ట్ అయ్యేలా లేదు. అలాగే సన్నివేశాలు గ్రిప్పింగ్ గా లేవు. స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ బావుంది. మిక్కీ నేప‌థ్య సంగీతం బావుంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. 

ప్ల‌స్ పాయింట్స్‌:
- సినిమాటోగ్ర‌ఫీ
- నేప‌థ్య సంగీతం
- నిర్మాణ విలువ‌లు 
- అక్క‌డ‌క్క‌డా డైలాగ్స్‌

మైన‌స్ పాయింట్స్‌:
- బ‌ల‌హీన‌మైన క‌థ‌, స్క్రీన్‌ప్లే
- సినిమా స్లోగా ఉండ‌టం
- పాత్ర తీరు తెన్నులు స‌రిగ్గా లేక‌పోవ‌డం
- బ‌ల‌మైన ఎమోష‌న్స్ క‌న‌ప‌డ‌వు
- యూత్‌కి ఇలాంటి కాన్సెప్ట్ క‌నెక్ట్ అయ్యే అవ‌కాశాలు త‌క్కువే

బోట‌మ్ లైన్‌: బంధాలు.. బంధువులు త‌ప్ప ఎమోషన్స్‌తో క‌నెక్ట్ కానీ... శ్రీనివాస క‌ళ్యాణం
రేటింగ్‌: 2.25/5

English Title
Srinivasa Kalyanam review
Related News