తుళ్లూరులో శ్రీవారి ఆలయం..

Updated By ManamTue, 08/28/2018 - 20:08
Srivari temple, construct, Tullur, TTD Council, TTD Transfort
  • టీటీడీ పాలక మండలి సభ్యుల నిర్ణయం

  • రూ.150 కోట్లతో ఆలయ నిర్మాణానికి ఆమోదం

Srivari temple, construct, Tullur, TTD Council, TTD Transfortతిరుమల: ఏపీలోని తుళ్లూరులో రూ.150 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం  సమావేశమైన టీటీడీ పాలకమండలి సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రూ.79 కోట్లతో తిరుమల గోవర్ధన అతిథి గృహం వద్ద నూతన యాత్రికుల వసతి సముదాయ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. 2015లో సవరించిన పీఆర్‌సీ ప్రకారం.. టీటీడీ ట్రాన్స్‌ఫోర్ట్ విభాగంలో పనిచేస్తున్న 65 మంది డ్రైవర్లు, 15 మంది ఫిట్టర్లకు రూ. 15 వేల నుంచి 24 వేలకు వేతనం పెంచుతూ నిర్ణయం టీటీడీ నిర్ణయం తీసుకుంది.

తిరుమలలోని హోటల్స్‌లో ధరల నియంత్రణకు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలోని యాత్రికుల వసతి గృ‌హాన్ని ఏపీ టూరిజంకు అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో కల్యాణమండపాల అభివృద్ధి పనులకు రూ.37 కోట్లను టీటీడీ పాలక మండలి కేటాయించింది. 

English Title
Srivari temple to be constructed in Tullur
Related News