ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సు బోల్తా

Updated By ManamThu, 01/25/2018 - 09:24
Srs Travels

Srs Travels కర్నూలు: జిల్లాలో ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. జిల్లాలోని వెల్దుర్తి మండలం అల్లుగుండు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వస్తున్న ఈ బస్సు మలుపు వద్ద వేగంగా వెళ్లడంతో ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. ఈ ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. మరికొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అత్యవసర చికిత్స కోసం క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. 

స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

English Title
SRS Travels Bus Accident At Kurnool Dist
Related News