అవినితి, అక్రమాలపై ఉక్కుపాదం

Updated By ManamFri, 06/15/2018 - 01:39
AKUN
  • వినియోగదారుల సమస్యలకు సత్వర పరిష్కారం.. సమచార సలహా, సహాయ కేంద్రం ప్రారంభం

  • ఫిర్యాదుల స్వీకరణకు కొత్త టోల్ ఫ్రీ నంబర్.. ఫేస్‌బుక్, ట్విటర్ హ్యాండిల్స్ ప్రారంభం

  • తెల్లకాగితంపై రాసిచ్చినా ఫిర్యాదు స్వీకరిస్తాం.. పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్  

AKUNహైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాల నివారణకు రాష్ట్ర పౌర సరఫరాలు,  తూనికలు కొలతలు, వినియోగదారుల సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. సరుకులు నాణ్యత, తూనికలు కొలతల్లో మోసాలుపై వినియోగదారులు నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు సమాచార సలహా, సహాయ కేంద్రాన్ని తూనికలు కొలతలు, వినియోగదారుల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ గురువారం ప్రారంభించారు. వినియోగదారుల ఫిర్యాదుల కోసం ఇప్పటికే టోల్‌ఫ్రీ నెంబర్ ఉండగా, ఇప్పుడు ఫేస్‌బుక్, ట్విటర్ హ్యాండిల్‌ను గురువారం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సమచార సలహా, సహాయ కేంద్రం వినియోగదారులతో సంభాషణకు, చర్చించడానికి చట్టబద్ధేతర వినియోగాదరుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వినియోగదారుల వివాదం పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేశారు. వినియోగదారులు తెల్లకాగితంపై సూచించిన పద్ధతిలో సమస్య రాసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇది పూర్తిగా ఉచితం. న్యాయవాదుల ఫీజులు, ఏ ఖర్చులుండవన్నారు. సక్రమంగా ఉన్న అన్ని ఫిర్యాదులను తాము పరిశీలించిన తర్వాత... ప్రతివాదుల సంజాయిషికి మూడు వారాల కాలపరిమితితో నోటిసులు జారీ చేస్తామని తెలిపారు. కేంద్రంలో.. ప్రతి శనివారం ఇప్పటికే కౌన్సిలింగ్  నిర్వహిస్తున్నామని తెలిపారు. వారి సమాధానాన్ని బట్టి..ఇరుపక్షాలను ఒక నిర్ణీత తేదీన కేంద్రానికి పిలిపించి వాది, ప్రతివాదులను నేరుగా వారివారి వాదనలను వినిపించుకునే అవకాశం కల్పిస్తారని చెప్పారు. పరిష్కారం కాని కేసులను మూడు కౌన్సెలింగ్‌ల తర్వాత జిల్లా వినియోగదారుల ఫోరంలో చట్టబద్ధంగా పరిష్కరించుకోవడానికి సూచించబడతాయన్నారు. గత నెల రోజుల్లో తూనికల కొలతల శాఖ మల్టిఫ్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్, విత్తన కంపెనీలు, ఎరువుల కంపెనీలు వివిధ వ్యాపార సంస్థలపై ప్రత్యేక తనిఖీలు జరిపామన్నారు. చట్ట విరుద్ధంగా ఉన్న 600 షాపులు, మాల్స్, స్టోర్స్‌లపై కేసులు నమోదు చేసి రూ. 12 కోట్లకు పైగా వస్తువులను సీజ్ చేసినట్లు ఆకున్ సబర్వాల్ వెల్లడించారు. వినియోగదారుల ఫిర్యాదులపై వినియోగదారుల సమచార సలహా, సహాయ కేంద్రం, తూనికల కొలతల శాఖలు ఎప్పటికప్పుడూ కలిసి పనిచేస్తాయని తెలిపారు.

టోల్ ఫ్రీ నంబర్ ప్రారంభం..
వినియోగాదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 1800 425 00333 టోల్‌ఫ్రీ నంబర్‌ను అకున్ సబర్వాల్ ప్రారంభించారు. ఫేస్‌బుక్‌లో కన్జ్యూమర్ ఇన్ఫమర్‌వెుషన్ రిడ్రెస్సెల్ సెంటర్, ట్విటర్‌లో తెలంగాణ కన్జూమర్ ఇన్ఫో అండ్ రిడ్రెసల్ సెంటర్‌లో ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. అంతేకాక  కన్జూమర్ అడ్వైస్.ఇన్ వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని కమిషనర్ సబర్వాల్ సూచించారు. 

వినియోగదారుల ఫోరం ద్వారా 2 లక్షల పరిహారం
హైదరాబాద్, మణికొండకు చెందిన లక్ష్మికాంత్ భార్య రాజ్యలక్ష్మి మెడ్ క్వెస్ట్ స్కానింగ్ సెంటర్‌లో తిఫ్ఫా టెస్ట్ చేయించుకున్నారు. ఐదు నెలలు గర్భస్థ శిశువు వెన్నులో సమస్య ఉన్నా అక్కడి నిర్వాహకులు గుర్తించలేదు. రాజ్యలక్ష్మి ఆడపిల్లను ప్రసవించగా, శిశువుకు వెన్నులో సమస్య ఉన్నట్లు గుర్తించారు. దీంతో బిడ్డను తీసుకొని లక్ష్మికాంత్ వైద్యం కోసం హైదరాబాద్‌లోని పలు హాస్పిటల్స్ తిరిగారు. స్కానింగ్ సమయంలో నిర్లక్ష్యం వల్ల చిన్నారికి శస్త్ర చికిత్స అవసరమైందని, ఇందుకుగాను రూ. 2 లక్షలు ఖర్చుపెట్టి వైద్యం చేయుంచుకున్నారు. చిన్నారికి మరికొంత కాలం వైద్యం చేయుంచుకోవాలని డాక్టర్లు చెప్పారు.

రైతుకు ప్రతి పైసా చెల్లించాం
ఈ ఏడాది రబీ సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి వందశాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ప్రతి పైసా ఆన్‌లైన్ ద్వారా రైతుల ఖాతాలో నేరుగా జమ చేశామని పౌర సరఫరాల శాఖ తెలిపింది. ఈ సీజన్‌లో రబీలో 3313 కొనుగోలు కేంద్రాల ద్వారా 6.11 లక్షల మంది రైతుల నుండి 35.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసింది. దీని విలువ రూ. 5601.97 కోట్లుండగా...ఈ నిధులను ప్రభుత్వం తరఫున పౌరసరఫరాల సంస్థ అన్ని జిల్లాలకు విడుదల చేసింది. దీనికి సంబందించిన రూ.349 కోట్లను తెలంగాణలోని ఆయా జిల్లాలకు విడుదల చేసినట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. దీంతో ధాన్యం కొనుగోలుకు సంబంధించి వంద శాతం నిధుల విడుదల పూర్తయ్యినట్లు చెప్పారు. రూ. 349 కోట్లు కూడా బ్యాంకులు పనిదినాల్లో ఒకటి, రెండు రోజుల్లో రైతు ఖాతాల్లో జమ అవుతాయన్నారు. పండుగను దృష్టిలో పెట్టుకొని రైతులకు చెల్లింపులతో పాటు హమాలీ, రవాణా, గన్నీ సంచులకు సంబంధించిన చెల్లింపులు కూడా పూర్తి చేశామని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ప్రతి పైసా కూడా చెల్లించావున్నారు. ఎక్కడా కూడా దళారులకు ఆస్కారం లేకుండా ఆన్‌లైన్ ద్వారా నేరుగా రైతుల ఖాతాలోకి కనీస మద్ధతు ధర చెల్లింపులను జమ చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. తెలంగాణలో ఎ పౌరసరఫరాల సంస్థ దగ్గర కూడా నిధుల సమస్య లేదన్నారు. 

English Title
Stabilization on irrigation and irregularities
Related News