సుస్థిర వ్యవసాయమే సరైన పరిష్కారం

Updated By ManamSun, 09/02/2018 - 22:13
agriculture

imageవేల సంవత్సరాల నుంచి పత్తిసాగు కొనసాగుతున్న నేపథ్యంలో ప త్తిసాగుకు ప్రాచీన భారత్ జన్మస్థానంగా పేరుపొందింది. ఒకప్పుడు పత్తి భారత్‌కు చిహ్నంగా, ప్రతిష్ఠ కు, సంపద, అందానికి ప్రతీకగా నిలిచింది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థి తి కనిపించడం లేదు. పత్తి సాగుచేసే రైతుల్లో అనిశ్చితి పరిస్థితుల కారణంగా నిరాశనిస్పృహలు నెలకొనివున్నాయి. భారత రైతుల దు స్థితిపై సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ (సీఎస్‌ఏ) కన్సల్టెంట్ కవిత కురుగంటి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని మహిళా రైతులతో గ్రీన్‌పీస్ కార్యక్రమాల్లో డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీతో కలిసి ఆరేళ్లపాటు ఆమె కృషిచేశారు.

జన్యుపరంగా బీటీ పత్తిని సాగుచేసిన 26 ఏళ్ల రాజిరెడ్డి అనే రైతు భార్య గోని లలిత అన్న మాటల్ని కవిత ఒకimage ఇంటర్వ్యూలో ఉదహరించారు. ‘ఒకరోజు రాజిరెడ్డి చేను కువెళ్లి ఎంతో నిరాశతో తిరిగివచ్చాడు. మేమెంతో ఆయన్ని సముదాయించాం. ఇంతలో పోయిందేమీ లేదు... మనమింకా కోలుకునేందుకు వీలుంది... అని నచ్చజెప్పేందుకు ప్రయత్నించాం. కానీ ఆయనలో మార్పు లేకపోయా’మని చెప్పాం. కానీ ఆయనలో నిరాశనిస్పృహల ను తొలగించలేకపోయాం.‘ఆ ఆశలేదు. గత ఏడాది కూడా (2004) ఇదే పరిస్థితి ఎదుైరెంది. ఈ సీజన్‌కు ఆశ కోల్పోలేక మరిన్ని అప్పు లు చేసి సాగుచేశా’మని అన్నా డు. ఒకరోజు ఉదయం లేచి చూసేసరికి ఆయన ఉరివేసుకుని కనిపించాడు. అప్పటి నుంచి మా పిల్లలకు, నాకు ఎలాంటి జీవనాధారం లేద’ని ఆమె దుఃఖంతో అన్న మాటలను కవి త గుర్తుచేశారు. ఇదొక రాజిరెడ్డి ఒక్కడి కథే కాదు. దేశంలోని లక్షలాది మంది పత్తిైరెతుల దుస్థితికి రాజిరెడ్డి కథ దర్పణంగా నిలుస్తుంది. ఆమె ఇంటర్వ్యూలోని ప్రధాన అంశాలు..

ప్ర: పత్తిసాగు అనేది ఒకప్పుడు భారత్‌కు గర్వకారణంగా ఉండేది. ప్రస్తుతం పత్తి ఉత్పత్తి, పరిస్థితిపై మీ అభిప్రాయం ఏమిటి?
జ: మీరు చెప్పిది నిజమే. ఒకప్పుడు భారత్ పత్తికి ప్రపంచ గుర్తింపు ఉన్నది. పత్తితో చేసిన చేనేత దుస్తులను గర్వంగా భారతీయులు భావించేవారు. ప్రస్తుతం తప్పుడు పద్ధతులు, సరైన విత్తనాల ఎంపిక, పురుగుమందుల కారణంగా రైతు తీవ్ర దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. 

ప్ర: పంటల్ని కాపాడుకునేందుకు ఇప్పటి పత్తిైరెతులు పురుగుమందులపై ఆధారపడుతున్నారు. మోనోసాంట్ బీటీ విత్తనాలు పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా పేరుపొందింది. బీటీ కాటన్ వల్ల నిజంగా భారత్ రైతులకు ప్రయోజనం ఉందా?
జ: తొలిచే పురుగును నివారించేందుకు బీటీ కాటన్ వల్ల కొన్ని పురుగుమందులను తగ్గించవచ్చునని నమ్మారు. అయితే కొత్తకొత్త తెగుళ్లు, చీడపీడల నివారణ కోసం కొత్తకొత్త విధానాలను రైతులు అనుసరించేందుకు ప్రయత్నించేవారు. భూసారం, నీటి నిర్వహణలపై సరైన సలహాలు లేక రైతులు పొరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంతో ఉత్పత్తి, సాగు పెట్టుబడులపై తగు పరిజ్ఞా నం కొరవడింది. దీంతో రుణభారం పెరిగి దోపిడీకి గురవుతున్నా డు. వీటన్నిటికంటే ప్రధానైవెునది... సరళీకృత ఆర్థిక వాతావరణంలో మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించడం లేదు.

ప్ర: భారతీయ రైతుల్లో ఎంతశాతం మంది బీటీ కాటన్‌ను ఉపయోగిస్తున్నారు?
జ: పారిశ్రామిక సంస్థల అంచనాల ప్రకారం, 2006 ఖరీఫ్ సీజన్‌లో మొత్తం 22 మిలియన్ ఎకరాల్లో పత్తి పంట సాగుచేస్తుంటే అందులో 39 శాతం మంది రైతులు మోనోసాంట్ బీటీ విత్తనాలు వాడుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి అధికారిక లెక్కలు లేవు. భారత్‌లో రైతుల ఆత్మహత్యల మరీ ముఖ్యంగా పత్తిైరెతుల ఆత్మహత్యల అంశం ఆందోళన కలిగిస్తోంది. 

ప్ర: ఎన్ని ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి? ఈ ఆత్మహత్యలు రాజ్యం చేసిన మారణహోమంగా పరిగణించాలనే అభిప్రాయాలెందుకు వ్యక్తమవుతున్నాయి?
జ: ఇటీవల అధికారిక అంచనాల ప్రకారం రైతుల ఆత్మహత్యలు గత దశాబ్దకాలంలో 150 వేల కోట్లకు చేరుకుంది. రైతులకు ఆర్థిక మద్దతు లేకపోవడంతో మరోమార్గం లేక తగని సాంకేతిక విధానాలను అనుసరించడం వల్ల పెద్దయెుత్తున అప్పు ల పాలవుతున్నారు. సమాజపరంగా ఇతరులకున్నట్టుగా వారికి ఎలాంటి సంఘమూ లేదు. వ్యవసాయ సంక్షోభంతో తలెత్తిన రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే కారణం. ప్రభుత్వాలు అనుసరించే రైతు వ్యతిరేక విధానం ఇప్పటికీ కనబడుతోంది. లక్షలాది మందికి అన్నం పెట్టే రైతును నిరాశనిస్పృహలకు గురిచేసి ఆత్మహత్యలే అంతిమ పరిష్కారమని రైతులు భావిం చేలా చేసిన రాజ్యమే ఇందుకు బాధ్యత వహించాలి. దేశం ‘అభివృద్ధి’ చెందుతున్నప్పుడు పంటల దిగుబడిని నిల్వచేసుకునే పరిస్థితులు తగ్గిపోయాయి. 

ప్ర: ఈ ఆత్మహత్యలపై భారత ప్రభుత్వం ఏం చెబుతోంది?
జ: వాళ్లవద్ద ఏవో కొన్ని పునరావాస ప్యాకేజీలున్నాయి. అవి స్వల్పగా మాత్రమే అమలులోకి వస్తున్నాయి. అసలు సమస్యకు, అందుకు తలెత్తుతున్న కారణాలకు వ్యతిరేకంగా ఈ పునరావాస ప్యాకేజీలు ఉండడం విచారకరం.

- కవితా కురుగంటి
సస్టెయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్  అలయెన్స్ సంస్థకు జాతీయ కన్వీనర్

English Title
Stable agriculture is the right solution
Related News