41 లక్షల ఖాతాలు మూత!

Updated By ManamWed, 03/14/2018 - 19:56
sbi
  • కనీస నిల్వ లేనందుకు ఎస్‌బీఐ చర్య

  • బ్యాంకులో మొత్తం 41 కోట్ల ఖాతాలు

  • సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడి

  • జరిమానాలతో రూ. 1771 కోట్ల ఆర్జన

sbiఇండోర్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీస సగటు నెలవారీ నిల్వ నిర్వహించనందుకు దాదాపు 41 లక్షలకు పైగా ఖాతాలను స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మూసేసింది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత గత సంవత్సరం ఏప్రిల్ నెలలో ఎస్‌బీఐ నెలవారీ కనీస నిల్వ లేకపోతే జరిమానాలు విధిస్తామని ప్రకటించింది. తర్వాత భారీగా చార్జీలను తగ్గించింది. అయితే, 2017 ఏప్రిల్ 1 నుంచి 2018 జనవరి 31 వరకు కనీస నిల్వ పాటించని 41.16 లక్షల ఖాతాలను మూసేసినట్లు మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌడ్ ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా బ్యాంకు తెలిపింది. దేశంలోనే అతి పెద్ద బ్యాంకు అయిన ఎస్‌బీఐలో 41 కోట్లకు పైగా సేవింగ్స్ ఖాతాలున్నాయి. వాటిలో 16 కోట్ల ఖాతాలు ప్రధానమంత్రి జనధన్ యోజన కింద తెరిచినవి, పెన్షనర్లు, వైునర్లు, సామాజిక భద్రతా ప్రయోజనదారుల ఖాతాలే. వీటిలో కనీస నిల్వ లేకపోయినా ఎలాంటి జరిమానా విధించరు. 2017 ఏప్రిల్ నుంచి నవంబరు వరకు కనీస నిల్వ పాటించని ఖాతాదారుల నుంచి జరిమానాల రూపంలో బ్యాంకుకు రూ. 1771.67 కోట్లు వచ్చాయి. ఇది బ్యాంకు రెండో త్రైమాసికంలో ఆర్జించిన లాభం కంటే ఎక్కువ. 

English Title
State Bank Of India (SBI) Closes Over 41 Lakh Savings Accounts
Related News