రాష్ట్ర పోలీసులు అలర్ట్‌గా ఉన్నారు: నాయిని

Updated By ManamSun, 09/23/2018 - 18:47
Naini narasimha reddy, State police, Aarku police station, Maoists attack  

Naini narasimha reddy, State police, Aarku police station, Maoists attack  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అరకు లాంటి ఘటన జరిగే అవకాశం లేదని హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసులు అలర్ట్‌గా ఉన్నారని ఆయన అన్నారు. ఆదివారం నాయిని మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు, పెద్దగా లేవని చెప్పారు.

వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగుతోందని నాయిని చెప్పారు. కాగా, విశాఖ మన్యంలో గ్రామసభకు వెళ్తున్న కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలపై మావోయిస్టులు తుపాకులు గురిపెట్టి కాల్చిచంపిన సంగతి తెలిసిందే. 

English Title
State police be alert after Aaruku Maoists attack, says Naini Narashimra reddy 
Related News