దశ తిరిగిన రిఫ్రాక్టరీ పరిశ్రమ

Updated By ManamTue, 03/13/2018 - 01:37
Refractory--Parmod-Sagar

Refractory--Parmod-Sagarన్యూఢిల్లీ: ఇటీవలి కాలం వరకు ‘చనిపోతున్న పరిశ్రమ’గా పరిగణన పొందిన, దేశీయ రిఫ్రాక్టరీ తయారీదార్లకు, చైనా దిగుమతుల ధరలు ఒక్కసారిగా పెరగడం వల్ల, హఠాత్తుగా దశ ఎత్తుకుంది. ఎంతో వేడికి కాని కరగని పదార్థం రిఫ్రాక్టరీ. ఇంతకుముందు, పూర్తయిన ఉత్పత్తులతోపాటు, రిఫ్రాక్టరీ ఇటుకలకు అవసరమైన ముడి పదార్థాలలో దాదాపు 40 శాతం (మాగ్నైసెట్, గ్రాఫైట్, ఫ్యూజ్డ్, కాల్సినెడ్  అల్యూమినా, హైగ్రేడ్ క్లేలు వంటివి) ముడి పదార్థాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అయితే, చైనా గనుల తవ్వకంపై విరుచుకుపడి, కఠినమైన కాలుష్య నియంత్రణ నిబంధనలు ప్రవేశపెట్టడంతో, ముడి పదార్థాల సరఫరాపై ప్రభావం పడింది. దీంతో దేశీయ రిఫ్రాక్టరీ మేకర్లైపెకి ఫోకస్ మళ్ళిందని ఇండియా ఇంటర్నేషనల్ రిఫ్రాక్టరీస్ కాంగ్రెస్ (ఐరెఫ్‌కాన్) చైర్మన్ పర్మోద్ సాగర్ చెప్పారు. 

లోహాలు, సిమెంటు, గాజు, సిరమిక్స్ తయారీలో అత్యధిక ఉష్ణోగ్రతతో కూడిన ప్రక్రియలన్నింటికీ రిఫ్రాక్టరీ ఉత్పత్తులు చాలా కీలకం. రిఫ్రాక్టరీ ఉత్పత్తులకున్న పెద్ద వినియోగదార్లలో ఉక్కు పరిశ్రమ ఒకటి. మొత్తం రిఫ్రాక్టరీ ఉత్పత్తుల్లో దాదాపు 60-70 శాతం ఉక్కు పరిశ్రమకే వెళతాయి. ‘‘ఒక ఏడాది క్రితం వరకు కూడా రిఫ్రాక్టరీని చనిపోతున్న పరిశ్రమగానే పరిగణించారు. ప్రతి ఒక్కరూ దాన్ని ఉపేక్షిస్తూ వచ్చారు. కానీ, ఈ చైనా అంశంతో, ఉక్కు, సిమెంటు తయారీకి అవసరమైన ఉత్పత్తిగా రిఫ్రాక్టరీని చూసే దృక్పథంలో మార్పు వచ్చింది’’ అని సాగర్ చెప్పారు. ఉక్కు పరిశ్రమలో రిఫ్రాక్టరీ కీలకమైన భాగం అయినప్పటికీ, ప్రభుత్వ ఉక్కు విధానంలో దాని ప్రస్తావన ఎప్పుడోగానీ కనిపించదని ఆయన అన్నారు. 

రేగిన ధరలు
రిఫ్రాక్టరీ ఉత్పత్తుల ధరలు 30-50 శాతం పెరుగుదలను చేస్తే, వివిధ కేటగిరీలకు చెందిన ముడి పదార్థాల ధరలు 10-150 శాతం పెరిగాయి. రూ. 6,500 కోట్ల దేశీయ రిఫ్రాక్టరీ పరిశ్రమ గత మూడు నుంచి ఐదేళ్ళ కాలంలో ధరలను ‘గణనీయంగా’ పెంచిన సందర్భాలు లేవు. కొద్దో గొప్పో ధరలను పెంచినా, దాన్ని ఇంతవరకు వినియోగదార్లకు విజయవంతంగా బదలీ చేయగలుగుతూ వచ్చింది. అయితే, ధరలు ఇక ఏమాత్రం పెరిగినా నిర్వహణ కష్టమే అవుతుందని సాగర్ చెప్పారు. 

 గనుల తవ్వక విధానం అవసరం
భారతదేశంలో ప్లాంట్‌లు నెలకొల్పేట్లుగా ప్రోత్సహించేందుకు, మెరుగైన గనుల తవ్వక విధానంతో కేంద్రం రిఫ్రాక్టరీ పరిశ్రమపై దృష్టి కేంద్రీకరించవలసి ఉంది. దేశంలో ముడి పదార్థాల పరిశోధన, అభివృద్ధికి నిధులు కేటాయించాలని సాగర్ కోరారు. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు రిఫ్రాక్టరీకి అవసరమైన ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. 

English Title
Step-by-step refractory industry
Related News