ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హఠాన్మరణం

Updated By ManamWed, 03/14/2018 - 09:33
stephen hawkings file photo
Stephen Hawkings Dies at 76

ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హఠాన్మరణం చెందారు. 76 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఆయన తన ఇంట్లో కన్నుమూశారు. ఆయన మరణాన్ని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. భౌతిక శాస్త్రంలో ఆయన చేసిన పరిశోధనలు ఎంత విప్లవాత్మకమో అందరికీ తెలిసిందే. అయితే, 1963లోనే విధి వక్రీకరించి ఆయన శరీర భాగాలు పనిచేయకుండా నరాల సంబంధిత వ్యాధిని ఆయనకు అంగట్టింది. దీంతో అప్పటి నుంచి ఆయన చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. అయినా కూడా భౌతిక శాస్త్ర పరిశోధనల్లో ఆయన వెలకట్టలేని పాత్ర పోషించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసిన ఆయన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తర్వాత భౌతిక శాస్త్రంలో అంత గొప్ప సేవలు అందించిన శాస్త్రవేత్తగా చరిత్రలో నిలిచిపోయారు. కాగా, తమ తండ్రి మరణించాడని చెప్పడానికి చింతిస్తున్నామని, ఆయన మరణంతో తీవ్రంగా విచారిస్తున్నామని ఆయన సంతానం లూసీ, రాబర్ట్, టిమ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయనో గొప్ప శాస్త్రవేత్త అని, ఆయన చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. ఆయన ధైర్యం, విజ్ఞానం, హాస్యచతురత ప్రపంచంలోని ఎంతో మంది ప్రజల్లో స్ఫూర్తి నింపాయని చెప్పారు. 

స్టీఫెన్ హాకింగ్ పర్సనల్ లైఫ్.... క్లిక్ చేయండి

English Title
Stephen Hawkings Dies at 76
Related News