ఇంటివాడు కాబోతున్న మరో కెప్టెన్

Updated By ManamWed, 02/14/2018 - 21:27
steve smith

steve smithక్రికెటర్లందరూ వన్ బై వన్ బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేస్తున్నారు. గతేడాది క్రికెటర్లందరూ వరుసగా పెళ్లి పీటలెక్కారు. ఏడాది చివర్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ షాకిచ్చాడు. ఇక ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్ మరొ కొద్దిరోజుల్లో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసి డేని విల్స్‌ను ఆయన సెప్టెంబర్‌లో వివాహం చేసుకోబోతున్నారు. 2011-12 బిగ్‌బాష్ లీగ్ సీజన్‌‌లో ఓ బార్‌లో తొలిసారిగా విల్స్‌ను కలిసిన స్మీత్‌ ఆమెతో ప్రేమలో పడిపోయాడు.. గత ఏడాది జూన్ 29న న్యూయార్క్‌లో తన మనసు మాటలో చెప్పాడు. ఈ ప్రపోజ్‌కు విల్స్‌ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెద్దల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ కూడా చేసేకున్నాడు. తాజాగా అలెన్ బోర్డర్ అవార్డుల ప్రధానోత్సవంలో మీ పెళ్లెప్పుడు అని మీడియా డేనిని ప్రశ్నించగా.. సెప్టెంబర్‌లోని సమాధానమిచ్చింది. ఈ వార్త ఇప్పుడు ఆస్ట్రేలియా మీడియాలో ట్రెండింగ్‌గా కొనసాగుతోంది.

English Title
steve smith marriage
Related News