కథల ఖజానా కథా నిలయం

Updated By ManamSat, 02/10/2018 - 01:40
KATHA


KATHAకథా నిలయం శైశవదశ (1997) నుంచి కథా నిలయ ప్రస్థానం గురించి రెండు మాటలు.
కాళీపట్నం రామారావు మాష్టారి  సంక ల్పంలో పురుడుపోసుకున్న కథా నిలయం ‘‘శ్రీకా కుళ సాహితి’’ స్థానిక, రాష్ట్ర, రాష్ర్టేతర ప్రాంతాల కథ, సాహిత్యాభిమానుల సహకారం కార్యదీక్షల వలన సాకారం చెంది 1997 ఫిబ్రవరి 22న స్వరూ పాన్ని సంతరించుకుంది. 1996 నుండి కారాగారికి లభించిన అవార్డులూ తన వ్యక్తిగత గ్రంథాలయం లోని 800 పుస్తకాలూ కథానిలయం యొక్క భౌతిక, క్రియాత్మక నిర్మాణంలో సింహభాగమ య్యాయి. కారాగారే ప్రధాన పుస్తకసేకర్త. మేమం తా ఆయనకు సహాయకులం. ఈ సందర్భంగా ఆయన తిరగని నగరమూ, పట్టణమూ లేదనడం అతిశయోక్తి కాదు. పుస్తకాలో, పత్రికలో లభిస్తా యంటే మారుమూల గ్రామానికైనా ఆయన ప్రయాణమయ్యేవారు.కథానిలయాన్ని తెలుగు కథా సాహిత్యానికి సంబంధించి పరిశోధనా గ్రంథాలయంగా తీర్చిదిద్దాలనేది మా ప్రధాన లక్ష్యం. దీనితో సహా రచ యితల ఛాయా చిత్రాలూ, రాతప్రతులూ, వర్తమాన కథా రచయితల కంఠస్వరాలూ, రాతప్రతులూ సేకరించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని పదిలపరచాలనే లక్ష్యాలను కూడా జోడించు కున్నాం. 1998లో కథా నిలయం నిర్వహణకోసం పది మంది సభ్యులతో ఒక ట్రస్టుబోర్డును ఏర్పాటు చేసుకున్నాం. దీనికి అధ్యక్షులుగా కారా, కార్యదర్శిగా డా॥ బి.వి.ఎ. రామారావు నాయుడు నియమితు లయ్యారు.  2013 డిసెంబరులో మరొక ముగ్గురు సభ్యులు ట్రస్టు బోర్డులో నియమితులయ్యారు. దీని నిర్మాణానికి కావలిసిన ఆర్థిక వనరుల సమీకరణ విషయంలో ఎవరి దగ్గరకూ ప్రత్యక్షంగా వెళ్లి విరాళాలు సేకరించ కూడదనుకున్నాం. పత్రికాముఖంగా చేసిన విన్నపాలకూ, కృషికి స్పందించి స్వచ్ఛందంగా అందజేసిన విరాళాలనే స్వీకరిస్తూ వచ్చాం.
ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి నెల (గురజాడ ‘‘దిద్దుబాటు’’ ఆంధ్రభారతిలో అచ్చయిన నెల)లో వచ్చే రెండవ శనివారం, దాన్ననుసరించే ఆదివారం వార్షికోత్సవ సభలు నిర్వహిస్తూ వస్తున్నాం. ఇది మాకొక సమీక్షా సమావేశం. ఈ సభలకు తెలుగు సాహిత్యంలో దిగ్ధంతులనదగిన పెద్దలను ఆహ్వానించి ప్రసంగింపజేస్తూ వస్తున్నాం.
ఈ రోజు ‘‘కథా నిలయం’’ విశిష్టమైన పరిశోధనా గ్రంథాలయంగా ఎదిగింది. దీనికి అనుబంధంగా 1914 వార్షికోత్సవ సందర్భములో రీడింగ్ రూమ్ కమ్ ఇస్యూ లైబ్రరీని ఆరు వేల గ్రంథాలతో ఏర్పాటు చేసాం. 800 గ్రంథాలతో ఆరంభమైన కథానిలయంలో ఈవాళ 25000 పుస్తకాలు, 25000 పత్రికా సంచికలు ఉన్నాయి. కథానిలయం లైబ్రరీ నుంచి రచయితలు పరిశోధక విద్యార్థులు, సాహితీ వేత్తలు ఉపయోగించుకున్న సేవలన్నీ ఇంటర్నేట్ ద్వారా అందరికీ మరింత అందుబాటులోకి తెచ్చాం.
కథానిలయం.కం అన్న పేరిట ఒక వెబ్‌సైట్ ఆరభించాం. ఈ వెబ్‌సైట్ నిర్వహణకు బెంగు ళూరులోని మనసు ఫౌండేషన్ అంగీకరించింది. ఈ వెబ్‌సైట్ నుంచి ఒక రచయిత పేరు టైపుచేస్తే అతని రచనల వివరాలు, ఫోటో లభిస్తాయి. అలాగే ఒక కథ పేరును బట్టి వెతుక్కోవచ్చు. పత్రికపేరును బట్టి లేదా ప్రచురణ అయిన సంవత్సరాన్ని బట్టి కథలు వెతుక్కోవచ్చు. 90 వేల కథలు, 18 వేల సంచికలు, 12 వందలకు పైగా పత్రికల వివరాలు ఈ వెబ్‌సైట్‌లో ఉంచాము.  తమకి కావాల్సిన కథలలో 43,000ల కథలు ఇప్పటికిప్పుడే డౌన్లోడు చేసుకొని చదువకోవచ్చు. మిగిలిన సుమారు 47,000 కథలను కూడా అతి త్వరలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలుగా పూర్తిస్థాయిలో పని చేస్తున్నాం. ఈ వెబ్‌సైట్‌లో కథానిలయం ఎజెండాలో ఉన్న వెబ్‌మ్యాగజైన్‌కు కూడా సదుపాయమున్నది. సరియైన సహకారం లభిస్తే దీనిని కూడా త్వరలో ఆరంభిస్తాం. యవ్వన దశలోనికి ప్రవేశించిన కథా నిలయంలో కథ, దాని అనుబంధ సాహిత్యం, అనువాద సాహిత్యం ఇక్కడ లభించినంత విస్తృతంగా మరెక్కడా లభించవని చెప్పుకోగల స్థాయిలో కథా నిలయం యవ్వన ప్రౌఢిమను సంతరించుకుంది. అందరి, ప్రధానంగా కథా రచయితల సంపూర్ణ సహకారం ఉంటే ద్విగుణీకృత శక్తితో ఇంకా అద్భుతమైన సేవలను కథా నిలయం అందించగలుగుతుంది.

డా॥బి.వి.ఎ.రామారావు నాయుడు, అధ్యక్షులు,  
దాసరి రామచంద్రరావు, కార్యదర్శి కథానిలయం ట్రస్ట్ బోర్డు
 9441095961
(నేడు, రేపు వార్షికోత్సవ సభలు)

English Title
The story is the treasury
Related News