ఒత్తిడి కూడా అంటువ్యాధే!

Updated By ManamFri, 03/09/2018 - 19:57
stress

ఒకరి నుంచి మరొకరికి పాకుతుంది

stressటొరంటో : అంటువ్యాధుల్లాగే ఒత్తిడి కూడా ఒకరి నుంచి మరొకరికి పాకుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైందని శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ఇలా మరొకరి నుంచి ఒత్తిడికి లోనైన వారి మెదడులో వాస్తవంగా ఒత్తిడి వల్ల కలిగే మార్పులు యథాతథంగా జరుగుతాయని తెలిపింది. ఈమేరకు ఎలుకలపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైందని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ కాల్‌గెరీ శాస్త్రవేత్తలు వివరించారు. వర్సిటీకి చెందిన భారత సంతతి శాస్త్రవేత్త జైదీప్ బైన్స్ ఈ విషయాన్ని కనుగొన్నారు. ఒత్తిడి కారణంగా మెదడులో మార్పులు చోటుచేసుకుని మానసిక అనారోగ్యాలు చోటుచేసుకుంటాయని జైదీప్ వివరించారు. ఇందులో పీటీఎస్‌డీ సహా పలు ఆందోళన సంబంధిత వ్యాధులు, మానసిక కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉందని వివరించారు. ఇటీవలి అధ్యయనాలలో ఒత్తిడి సహా ఇతరత్రా భావోద్వేగాలు కూడా అంటువ్యాధుల్లాగే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయని తేలిందని చెప్పారు. అయితే, వీటివల్ల మెదడుపై దీర్ఘకాలంలో పడే ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై ఇప్పటికి స్పష్టతలేదని జైదీప్ వివరించారు. 

English Title
Stress is also epidemic!
Related News