మహిళల ఈవెంట్‌లో కఠినమైన డ్రా

Updated By ManamSat, 08/18/2018 - 00:13
PV Sindhu Saina Nehwal

PV Sindhu Saina Nehwalజకార్తా: ఆసియా గేమ్స్‌లో భారత మహిళల బ్యాడ్మింటన్ బృందాన్నికి టీమ్ ఈవెంట్‌లో కఠినమైన డ్రా ఎదురైంది. 2014లో జరిగిన ఆసియా గేమ్స్‌లో భారత మహిళల జట్టు మూడో స్థానం సంపాదించి కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గేమ్స్‌లో భారత్ జట్టు టీమ్ విభాగంలో టాప్ ప్లేయర్స్‌తో పోటీపడనుంది. మొదటి హాఫ్‌లో హంగ్‌కాంగ్, కొరియా, ఇండోనేషియా, జపాన్ జట్లతో తలపడనుండగా, దిగువభాగంలో చైనా, థాయిలాండ్, చైనీస్ తైపీ జట్లతో భారత్ జట్టు పోటీపడనుంది. మహిళల సింగిల్స్ విభాగంలో జపాన్‌కి చెందిన ఒకుహర, యమగూచితో, యూకీ హిరోటా,మిసాకి, అయాకా తకాహషీతో, సింధు, అశ్విని పొన్నప్ప జోడి టీమ్ విభాగంలో తలపడనున్నారు. భారత పురుషుల టీమ్ ఈవెంట్‌లో శ్రీకాంత్, హెచ్ ప్రణయ్ ప్రారంభమ్యాచ్‌లో మాల్దీవుల ప్లేయర్స్‌తో పోటీపడనున్నారు. అనంతరం ఇండోనేషియాతో భారత్ తలపడుతుంది. డిఫెండింగ్ చాంపియన్ కొరియాతో థాయిలాండ్ జట్టు ఆదివారం మొదటి మ్యాచ్ ఆడనుంది.

English Title
Strict draw in women's event
Related News