ఏపీ బంద్: డిపోల్లో నిలిచిన బస్సులు

Updated By ManamMon, 04/16/2018 - 07:51
APSRTC

APSRTC అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి నేడు(సోమవారం) ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజాము నుంచే పలు చోట్ల ప్రత్యేకహోదా సాధన సమితి ఆధ్వర్యంలో పలువురు ఆందోళన చేపట్టారు. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, కడప, పశ్చిమగోదావరి, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో బస్సులు డిపోను దాటి బయటకు రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో బస్సులు నిలిచిపోయాయి. మరోవైపు ఈ బంద్‌కు టీడీపీ మినహా మిగతా పార్టీలన్నీ మద్దతును ప్రకటించడంతో ఆయా పార్టీ నేతలు బంద్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళంలో ఆందోళన చేస్తున్న తమ్మినేని సీతారాం, వామపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

English Title
Strike in Andhrapradesh Related News