హైదరాబాద్: మూసాపేటలో విషాదం

Updated By ManamTue, 02/13/2018 - 08:53
Student Suicide

హైదరాబాద్: మూసాపేటలో విషాదంహైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా భాగ్యనగరంలోని విద్యార్థులు క్షణికావేశంలో జీవితాలను చిదిమేసుకుంటున్నారు. తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి గొప్ప కొలువుల్లో చూడాలనుకున్న తల్లిదండ్రుల ఆశలు అడియాసలవుతున్నాయి. విద్యార్థులు తీసుకునే నిర్ణయాలతో వారి కుటుంబీకులు జీవితాంతం క్షోభ అనుభవించాల్సి వస్తోంది.

తాజాగా.. నగరంలోని మూసాపేట వడ్డెర బస్తీలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వైష్ణవి ఆత్మహత్యతో మృతురాలి బంధువులు, కుటుంబీకులు కన్నీరుమున్నీరై రోదిస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు స్కూల్‌‌లో ఏమైనా గొడవలు జరిగాయా? టీచర్లు వేధించారా? తోటి విద్యార్థులు ఏమైనా ఇబ్బందిపెట్టారా? కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. తోటి విద్యార్థిని ప్రేమ వ్యవహారంపై లెక్చరర్ ప్రశ్నించాడని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

English Title
Student Suicide In Hyderabad Moosapet
Related News