లాభాల స్వీకరణతో కుంగిన సూచీలు

Updated By ManamThu, 02/15/2018 - 01:24
stocs

ఆర్బీఐ కొత్త నిబంధనలతో కుదేైలెన బ్యాంకింగ్ రంగ షేర్లు

stocsముంబయి: బుధవారం ట్రేడింగ్ చివరలో సాగిన లాభాల స్వీకరణతో బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజ్ (బి.ఎస్.ఇ) సున్నిత సూచి ‘సెన్సెక్స్’ సోమవారంకన్నా 144 పాయింట్ల దిగువున ముగిసింది. స్ట్రెస్సడ్ ఎసెట్లను గుర్తించడానికి సంబంధించి ఆర్.బి.ఐ నూతన నిబంధనలు జారీ చేయుడంతో బ్యాంకిం గ్ రంగ షేర్లు చతికిలపడ్డాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పి.ఎన్.బి) సుమారు రూ. 11,335 కోట్ల విలువ చేసే మోసపూరిత లావాదేవీలు కనుగొన్నట్లు వెల్లడించడంతో, దాని షేర్ ధర బుధవారం 9.81 శాతం క్షీణించింది. మొండి బాకీల పరిష్కారాన్ని వేగవంతం చేసే ప్రయుత్నంలో, రుణాల వసూలులో ఏ విధైమెన ఎగవేతైనెనా సరే వేగంగా గుర్తించి, పరిస్థితిని చక్కదిద్దేందుకు నడుం బిగించే విధంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్.బి.ఐ) నిబంధనలను కట్టుదిట్టం చేసింది. ఇప్పుడున్న అర డజ ను రుణ పునర్నిర్మాణ యంత్రాంగాలను ఆర్.బి.ఐ రద్దు చేసింది. రుణాన్ని ఎగవేసిన కేసులో పరిష్కార ప్రణాళికకు రావడానికి బ్యాంకులకు 180 రోజుల గడువును విధించింది. ఆ కాల పరిధిలో ఏమీ చేయులేకపోతే సదరు రుణం తీసుకున్న సంస్థను దివాలా ప్రక్రియ పరిశీలనకు పంపవలసిందని ఆదేశించింది. 


గీటురాయిగా భావించే బి.ఎస్.ఇ ‘సెన్సెక్స్’, దేశీయ, అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో 34,436. 98 పాయింట్ల వద్ద బుధవారం ఉద యం అధిక స్థాయిలోనే మొదైలెంది. అది ఒక దశలో 34,473.43 పాయిం ట్ల గరిష్ఠ స్థితికి చేరుకుంది. తర్వాత, చోటుచేసుకున్న ప్రాఫిట్ బుకింగ్‌తో 34,028.68 పాయిం ట్ల కనిష్ఠ స్థితిని చూసి, చివరకు 34,155.95 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజ్ (ఎన్.ఎస్.ఇ) సూచి ‘నిఫ్టీ’ ఇంట్రా-డేలో 10,590.55- 10,456.65 పాయింట్ల మధ్య ఊగిసలాడిన అనంతరం చివరకు 10,500.90 పాయింట్ల వద్ద ముగిసింది.


పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి
వస్తూత్పత్తి, మూలధన వస్తువుల రంగ బలైమెన పనితీరుతో డిసెంబరులో పారిశ్రామిక ఉత్పత్తి 7.1 శాతం పెరిగినట్లు సోవువారం ట్రేడింగ్ వేళలు ముగిసిన తర్వా త విడుదైలెన డాటా తెలియుజేసింది. మరోపక్క, ఆహార పదార్థాల ధరలు చల్లబడడంతో, డిసెంబరులో 17 నెలల గరిష్ఠ స్థాయిలో 5.21 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జనవరిలో స్వల్పంగా తగ్గి 5.07 శాతంగా నిలిచింది. ''పటిష్టైమెన ఐ.ఐ.పి వృద్ధి, మందగిస్తున్న రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం పొందుతోందనడానికి కొన్ని సంకేతాలుగా నిలుస్తున్నాయి. కానీ, సామర్థ్యం మేరకు కొన్ని కంపెనీలు లాభాలు కనబరచకపోవడం వల్ల విస్తృత మార్కెట్ కొంత ఉత్థాన పతనాలను చవిచూసింది. రుణ పునర్నిర్మాణ పథకాలు చాలా వాటిని ఆర్.బి.ఐ రద్దు చేసింది. లేకపోతే, మొండి బాకీలకు పక్కనపెడుతున్న మొత్తాలు ఇంకా పెరిగిపోవచ్చని అది కలవరపడింది. అవి బ్యాంకుల లాభదాయుకతపై ప్రభావం చూపుతున్నాయి. ఆర్.బి.ఐ నిర్ణయంతో పి.ఎస్.యు బ్యాంకుల షేర్లు అమ్మకాలకు లోనయ్యాయి'' అని జియోజీత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ అన్నారు.

వాళ్ళు అమ్మితే... మనం కొన్నాం
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సోవువారంనాడు రూ. 814.11 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, దేశీయ మదుపు సంస్థలు రూ. 1,342.70 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశాయి. 

English Title
Subtotal indexes with profit margins
Related News