కొత్త సంవత్సర వేడుకపై ఆత్మాహుతి దాడి

Updated By ManamWed, 03/21/2018 - 15:31
kabul suicide attack
  • అఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లోని మందిరంపై దాడి.. 26 మంది మృతి.. 18 మందికి గాయాలు

suicide attack in kabulకాబూల్: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సాఖి మందిరంపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. సాంప్రదాయ కొత్త సంవత్సర వేడుక ‘నౌరూజ్’కు భారీగా తరలివచ్చిన భక్తులనే లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి దిగారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో 26 మంది దుర్మరణం చెందగా.. 18 మందికి తీవ్రగాయాలయ్యాయి. వేడుకకు తరలివచ్చిన వారిలో ఎక్కువగా మైనారిటీలైన షియా ముస్లింలే ఉన్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఈ దాడికి పాల్పడింది ఎవరన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాఖి పుణ్యక్షేత్రంలోకి వచ్చిన ఓ దుండగుడు.. పోలీసులు గుర్తించేలోపే పేల్చేసుకున్నాడని అంతర్గత మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. కాబూల్ యూనివర్సిటీకి సమీపంలోగల అలీ అబద్ హాస్పిటల్‌‌కు అత్యంత సమీపంలోనే ఉన్న ఈ మందిరాన్నే ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నారు. 

English Title
suicide bombing outside shrine
Related News