స్టైలిష్‌స్టార్‌తో ముచ్చటగా మూడో మూవీ

Updated By ManamWed, 03/21/2018 - 14:54
bunny

Bunny, Sukumar సినిమా ఫలితం ఎలా ఉన్నా కొన్ని కాంబినేషన్లకు క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. ఈ లిస్ట్‌లో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టార్ సుకుమార్ కాంబినేషన్ ఒకటి. ఈ ఇద్దరి కాంబోలో ఇప్పటికే 'ఆర్య', 'ఆర్య-2' రాగా.. అందులో ఒక సినిమా భారీ విజయాన్ని, మరో చిత్రం యావరేజ్‌ను సొంతం చేసుకుంది. అయినా ఈ కాంబినేషన్‌లో మరో మూవీ రావాలని ఎప్పటినుంచో టాలీవుడ్ ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

అంతేకాదు బన్నీతో మరో సినిమాను కచ్ఛితంగా తీస్తానని ఆ మధ్యలో సుకుమార్ కూడా పలుమార్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్‌లో మరో చిత్రం సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్యలో నటిస్తున్న బన్నీ.. తన తదుపరి సినిమాలపై మాత్రం అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు. దీంతో ఈ కాంబినేషన్ ముచ్చటగా మూడోసారి సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మెగాభిమానులకు మరో శుభవార్తనే.

English Title
Sukumar next movie with Allu Arjun
Related News