‘యన్‌టిఆర్’ కోసం ఏఎన్నార్ వాడిన చివరి కారులో

Updated By ManamWed, 09/12/2018 - 09:25
NTR, ANR

Sumanth, NTRబాలకృష్ణ ప్రధానపాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్‌టిఆర్’. నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ మూవీ షూటింగ్‌లో తాజాగా భాగం అయ్యాడు హీరో సుమంత్.

ఇందులో సుమంత్, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కనిపిస్తుండగా.. ఆ మూవీ షూటింగ్‌కు తాజాగా వెళ్లాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన సుమంత్.. ‘‘ఏఎన్నార్ వాడిన చివరి కారులో ఆయన పాత్రను పోషించేందుకు మొదటిరోజు వెళ్తున్నా’’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేసుకున్నాడు. కాగా ఈ చిత్రంలో విద్యాబాలన్, ప్రకాశ్ రాజ్, నరేశ్, కైకాల సత్యనారాయణ, రానా తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి, బాలకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మూడు భాషలలో తెరకెక్కుతుండగా.. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sumanth (@sumanth_kumar) on

 

English Title
Sumanth joins in NTR biopic
Related News