వేసవిలో ‘పంతం’

Updated By ManamThu, 03/22/2018 - 03:20
gopichand

gopichandగోపీచంద్ కథానాయకుడిగా కె.కె.,రాధామోహన్ నిర్మిస్తోన్న చిత్రం ‘పంతం’.‘ఫర్ ఎ కాస్’ ఉప శీర్షిక.  కె.చక్రవర్తి దర్శకుడు. గోపీచంద్ నటిస్తోన్న 25వ చిత్రమిది. ఈ సినిమా ఫస్‌లుక్‌ను విడుదల చేసిన సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌లో గోపీచంద్‌గారి 25వ సినిమాగా ‘పంతం’ను హ్యాపీగా ఉంది. అనుకున్న ప్లాన్ ప్రకారం సినిమాలో 60 శాతం చిత్రీకరణను పూర్తిచేశాం. మంచి మెసేజ్‌తో పాటు కమర్షియల్ హంగులతో సినిమాను దర్శకుడు చక్రి చక్కగా తెరకెక్కిస్తున్నారు. హీరో గోపీచంద్‌గారి క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు కనపడని స్టైలిష్ లుక్‌లో గోపీచంద్‌గారు కనపడతారు. సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాం. అలాగే మెహరీన్ చాలా మంచి పాత్రలో కనపడతారు. గోపీ సుందర్ సంగీతం, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రపీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు సహకారంతో సినిమాను అనుకున్నట్లు పూర్తి చేసి ఈ వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. 

Tags
English Title
Summer 'Pant'
Related News